అభిమానిపై పిడిగుద్దులు కురిపించిన ప్రముఖ ఆటగాడు.. వీడియో వైరల్

‘వెళ్లు..ఫుట్‌బాల్ ఆడటం ఎలాగో నేర్చుకో’ అని నేయ్‌మర్‌ను హేళన చేశాడు. దీంతో కోపం ఆపుకోలేకపోయిన అతడు అభిమాని ముఖంపై పంచ్ ఇచ్చాడు.

news18-telugu
Updated: April 30, 2019, 3:00 PM IST
అభిమానిపై పిడిగుద్దులు కురిపించిన ప్రముఖ ఆటగాడు.. వీడియో వైరల్
నేయ్‌మర్
news18-telugu
Updated: April 30, 2019, 3:00 PM IST
ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన నిరాశలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు నేయ్‌మర్ ఓ అభిమానిపై పిడిగుద్దులు కురిపించాడు. ఇదేనా ఆడే పద్ధతి.. ముందుగా వెళి ఆడటం ఎలాగో నేర్చుకో అని హేళన చేసినందుకు అతడి ముఖంపై పంచ్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. శనివారం ఫ్రెంచ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ప్యారిస్ సెయింట్ జర్మేన్(పీఎస్‌జీ), రెనెస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ తరఫున బ్రెజిల్ ఆటగాడు నేయ్‌మర్ ఆడాడు. అయితే, ఈ జట్టుపై రెనెస్ 6-5 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం పీఎస్‌జీ సభ్యులు రన్నరప్ మెడల్ తీసుకొని తిరిగి వస్తుండగా ఓ అభిమాని ‘వెళ్లు..ఫుట్‌బాల్ ఆడటం ఎలాగో నేర్చుకో’ అని నేయ్‌మర్‌ను హేళన చేశాడు. దీంతో కోపం ఆపుకోలేకపోయిన అతడు అభిమాని ముఖంపై పంచ్ ఇచ్చాడు.

కాగా, నేయ్‌మర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓడిపోయినపుడు అభిమానుల నుంచి అసహనం వ్యక్తం కావడం మామూలేనని, అలాంటప్పుడే సంయమనం పాటించాలని, ఎదురుదాడికి దిగడం మంచిది కాదని హెచ్చరించారు. తన చర్యపై నేయ్‌మర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని చెప్పాడు. తప్పుగా ప్రతి స్పందించానని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...