హైదరాబాద్ లేడీ కానిస్టేబుల్ కి లవ్ ప్రపోజ్ ...సీన్ రివర్స్

ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ నేనెవరో తెలుసుగా.. కానిస్టేబుల్ అని కాస్త స్వరం పెంచింది. మీరు ఇక్కడే పీఎస్ లో వర్క్ చేస్తారని తనకు తెలుసన్నాడు. స్టూడెంట్‌వి సరిగా చదువుకోక పిచ్చిపిచ్చిగా ఇవన్నీ ఏందీ..


Updated: October 18, 2019, 12:21 PM IST
హైదరాబాద్ లేడీ కానిస్టేబుల్ కి లవ్ ప్రపోజ్ ...సీన్ రివర్స్
కానిస్టేబుల్ కు ప్రపోజ్ చేస్తున్న యువకుడు
  • Share this:
మాములుగా పోలీసులతో మాట్లాడటానికే కొంతమంది భయపడుతుంటారు. కానీ ఓ యువకుడు ఏకంగా లేడీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కే లవ్ ప్రపోజ్ చేశాడు.మేడం మీరు ప్రియాంకా కదా! హాయ్ మేడం మిమ్మల్ని మూడు నెలలుగా ఫాలో అవుతున్నాను అంటూ ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు.ఎందుకని ఆమె అడగ్గా.. ముందు నేను చెప్పేది వినండి మేడం అంటూ మొదలుపెట్టాడు. మీరు నాకంటే పెద్ద.. పైగా పోలీస్ కదా అందుకే చెప్పడానికి భయం వేసింది.మీ వెనుకాలే తిరుగుతున్నా మేడం ,మీరు అర్ధం చేసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అని కానిస్టేబుల్‌కి ప్రపోజ్ చేశాడు. దానికి ఆవిడ బదులిస్తూ నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి? అని ప్రశ్నించింది.

ట్రూ లవ్‌కి వయస్సుతో సంబంధమేంటి అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు అజయ్. దాంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ నేనెవరో తెలుసుగా.. కానిస్టేబుల్ అని కాస్త స్వరం పెంచింది. మీరు ఇక్కడే పీఎస్ లో వర్క్ చేస్తారని తనకు తెలుసన్నాడు.స్టూడెంట్‌వి సరిగా చదువుకోక పిచ్చిపిచ్చిగా ఇవన్నీ ఏందీ.. బుద్దిగా వెళ్లి చదువుకో సున్నితంగా హెచ్చరించింది. అయినా మాట వినని సదరు యువకుడు మేడం ఒకసారి నా మాట వినండి మేడం నేను ప్రపోజ్ చేసే విధానం తప్పు కావచ్చు కానీ 'నాది ట్రూ లవ్ మేడం, మీకు అర్ధం కావడం లేదు.నేను చెప్పేది' అని అజయ్ చెప్పుకుంటూ పోయాడు. అతని మాటలకు మధ్యలోనే అడ్డుపడ్డ కానిస్టేబుల్.. ఏందీ అర్ధం అయ్యేది.. పో వెళ్లి చదువుకో పో, నీకు నాకు సెట్ కాదు ఎక్కువ మాట్లాడితే స్టేషన్ కి తీసుకెళ్తా గట్టిగానే మందలించింది. ఆలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగాక..ఓపిక నశించిన కానిస్టేబుల్ మీ అమ్మ నాన్న నెంబర్ ఇవ్వు అని అడిగింది. దానికి బదులిస్తూ.. 'మీ కోడలు దొరికింది' అని ఇంట్లో కూడా చెప్పాను మేడమ్ అని షాకిచ్చాడు.

ఇక మాటలతో చెబితే లాభం లేదనుకుని కానిస్టేబుల్ అతని చొక్కా పట్టుకుని స్టేషన్‌కు నడువమన్నది. దీంతో ఏడవటం మొదలుపెట్టిన అజయ్.. ఆమెను మరింత విసిగిస్తాడు. చివరకు ఆమె ఆగ్రహం కట్టలు తెచ్చుకునేలా ఉండటంతో అజయ్ అసలు విషయం చెప్పేశాడు. ఇప్పటిదాకా చేసిందంతా ప్రాంక్ వీడియోలో భాగమని చెప్పాడు. హర్ష అనే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ అజయ్ చేసే ప్రాంక్ వీడియోస్ నచ్చడంతో తన కజిన్ మీద కూడా ఇలా ప్రాంక్ చేయించాడు.ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading