Piyush Goyal | పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. ఆడుకుంటున్న నెటిజన్లు

Piyush Goyal | ‘లెక్కల గురించి మర్చిపోండి. లెక్కల వల్ల ఐన్‌స్టీన్ గ్రావిటీని (భూమి ఆకర్షణ శక్తి) గుర్తించలేదు.’ అని అన్నారు. అసలు గ్రావిటీని గుర్తించింది ఐన్‌స్టీన్ కాదు న్యూటన్.

news18-telugu
Updated: September 12, 2019, 8:38 PM IST
Piyush Goyal | పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. ఆడుకుంటున్న నెటిజన్లు
పీయూష్ గోయల్ (File)
  • Share this:
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పప్పులో కాలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోల్స్ చేసే అవకాశాన్నిచ్చాయి. ఆర్థికమందగమనం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘లెక్కల గురించి మర్చిపోండి. లెక్కల వల్ల ఐన్‌స్టీన్ గ్రావిటీని (భూమి ఆకర్షణ శక్తి) గుర్తించలేదు.’ అని అన్నారు. అయితే, అక్కడే ఆయన తప్పులో కాలేశారు. అసలు గ్రావిటీని గుర్తించింది ఐన్‌స్టీన్ కాదు న్యూటన్. న్యూటన్ ఓ ఆపిల్ చెట్టు కింద కూర్చుని ఉండగా, పండు కింద పడడాన్ని చూసిన న్యూటన్.. అసలు ఆ పండు కిందకే ఎందుకు పడుతుందనే సందేహించారు. అలా, భూమ్యాకర్షణ శక్తి ఉందని కనిపెట్టారు. ఈ విషయం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో కనిపిస్తాయి. అయితే, సాక్షాత్తూ కేంద్ర మంత్రి, గతంలో ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించిన పీయూష్ గోయాల్ ఇలా తప్పులో కాలేయడంతో నెటిజన్లు ఆయన మీద జోక్స్ వేస్తున్నారు.









First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...