NEWS THAT HIDDEN TREASURES HAVE BEEN UNCOVERED IN AFGHANISTAN JOWZJAN PROVINCE AREA PRV
Afghanistan treasures: అప్ఘనిస్తాన్‌లో గుప్త నిధుల కలకలం.. జ్వాజియన్ ప్రావిన్స్‌లో బయట పడ్డట్లు వార్తలు
ప్రతీకాత్మక చిత్రం
అప్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైనట్లే. అయితే తాజాగా అప్ఘనిస్తాన్‌లో గుప్త నిధుల(treasures) అంశం తెరపైకి వచ్చింది. జ్వాజియన్ ప్రావిన్స్‌లో గుప్త నిధులు బయటపడినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ గుప్త నిధులు ఎక్కడున్నాయి.. ఎవరికి దొరికాయి తెలుసుకుందాం
అప్ఘనిస్తాన్( Afghanistan). గత కొద్దిరోజులుగా ప్రపంచంలో మారుమోగుతున్న దేశం పేరు. తాలిబాన్లు(Talibans) అకస్మాత్తుగా దాడులు చేసి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాణభయంతో అక్కడి ప్రజలు పారిపోవడం మొదలుపెట్టారు. అయితే ఆ దేశంలో ఒకే ఒక విమానాశ్రయం కాబూల్(Kabul)లో ఉండటంతో జనం వేలాదిగా చేరుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి టెర్రరిస్టులు, ఐసీస్ దాడులకు తెగబడుతోంది. గత రెండు రోజుల కిందట జరిగిన పేలుళ్లలోనే చాలా మంది మరణించారు. అందులో అమెరికా సైనికులూ ఉండటంతో పెద్దన్న కన్నెర్రజేశాడు. అయితే తాలిబన్ల్లు అమెరికాకు పెట్టిన డెడ్‌లైన్ కూడా నేటితో ముగిసిపోతుంది. అప్ఘనిస్తాన్‌ను ఆగస్టు 31లోగా ఖాళీ చేస్తామని ఆమెరికా చాలా రోజుల కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇక పూర్తిగా అప్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైనట్లే. అయితే తాజాగా అప్ఘనిస్తాన్‌లో గుప్త నిధుల(treasures) అంశం తెరపైకి వచ్చింది. జౌజ్జాన్ ప్రావిన్స్(Jowzjan Province)లో గుప్త నిధులు బయటపడినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ గుప్త నిధులు ఎక్కడున్నాయి.. ఎవరికి దొరికాయి తెలుసుకుందాం..
తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ జౌజ్జాన్ ప్రావిన్స్(Jowzjan Province)లో తిల్యాతోపే అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున నిధులు(treasures) బయటపడ్డాయట. సోవియట్ యూనియన్ ఆధీనంలో ఆఫ్ఘానిస్తాన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20, 600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి బయటపడ్డాయి. ఇవి క్రీస్తూ పుర్వం 1 వ శతాబ్దానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందులో చాలా వరకు అప్పటి సోవియట్ యూనియన్ చేతికి చిక్కాయి. మిగిలిన వాటిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాగ్రత్తగా భద్ర పరుస్తూ.. వస్తోంది. అయితే.. ఆ విలువైన సంపద ఎక్కడ తాలిబన్ల వశం అవుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. 1994 లో ఈ సంపదను తాలిబన్ల వశం కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే.. ఇప్పుడు తాలిబన్లు ఆ సంపదను దోచుకుంటారా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఇక దీనిపై భవిష్యత్తులోనే క్లారిటీ రానుంది.
కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో ఎక్కడ చూసిన కొండలు గుట్టలు..అంతా పర్వత ప్రాంతం.. కరువు కాటకాలు అంతే కాకుండా ఓ యుద్ద భూమి కల్లోల రాజ్యం కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓ బంగారు గని. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇక్కడ లేని ఖనిజ సంపద లేదు. ఖనిజ సంపద మాత్రమే కాదు చమురు నిక్షేపలాకు కూడా నిలయం. ఎన్ని ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఓ పేద దేశమే కావడం బాధాకరం. రాజకీయ స్థిరత్వం లేక ఆఫ్గనిస్తాన్ ఎప్పుడూ రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది. దశాబ్దాలకు దశాబ్దాలు ఆఫ్ఘనిస్తాన్‌లో పరాయి దేశాల పెత్తనం కొనసాగుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి.యాబై ఏళ్లుగా ఇదే జరుగుతోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ సహజ నిక్షేపాలను వెలికితీసేవారు లేకుండా పోయారు. కానీ ఇప్పుడు చాలా దేశాల కన్ను ఆఫ్ఘనిస్తాన్లోని సహజ నిక్షేపాల పైనే పడింది. దానికోసమైనా తాలిబన్లతో ఇతర దేశాలు దోస్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌తో దోస్తీకి సిద్దమని కూడా ప్రకటించాయి. ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకుంటే దాదాపు లక్షల కోట్ల సంపద ఇప్పుడు తాలిబన్ల చేతికి వస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.