Home /News /trending /

NEWS REPORTER GETS HIT BY CAR ON LIVE TV CONTINUES REPORTING PVN

Viral Video : కారు గుద్దేసి వెళ్లినా కూడా..రిపోర్టింగ్ ఆపని జర్నలిస్ట్

కారు గుద్దేసి వెళ్లినా రిపోర్టింగ్ ఆపలే

కారు గుద్దేసి వెళ్లినా రిపోర్టింగ్ ఆపలే

Lady Reporter : మహిళా రిపోర్టర్(Lady Reporter) లైవ్ ఇస్తుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీ కొట్టింది. అయినా లైవ్ మాత్రం ఆపలేదు ఆ రిపోర్టర్. వృత్తి పట్ల టోరీ యోర్గీకు ఉన్న అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తరువాత మాత్రం

ఇంకా చదవండి ...
News Reporter Gets Hit By Car :  లైవ్ రిపోర్టింగ్ అనేది అంత ఈజీ కాదు. అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా..కెమెరా ముందు మాత్రం మౌనంగా ఉండాల్సిందే. అమెరికాలోని ఓ టెలివిజన్ న్యూస్ రిపోర్టర్ విషయంలో అదే జరిగింది. వెస్ట్ వర్జీనియా మహిళా రిపోర్టర్(Lady Reporter) లైవ్ ఇస్తుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీ కొట్టింది. అయినా లైవ్ మాత్రం ఆపలేదు ఆ రిపోర్టర్. లైవ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ జర్నలిస్టుకి సంబంధించిన వీడీయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెస్ట్ వర్జీనియా టెలివిజన్ ఛానెల్‌ ప్రత్యక్ష ప్రసారంలో రిపోర్టింగ్ అందిస్తున్న టోరి యోర్గీ(Tory Yorgey)ఒక మహిళకి లైవ్‌ లోనే యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె లైవ్‌ రోపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో ఒక SUV కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాంతో ఆ మహిళా రిపోర్టర్ పడిపోయినా..కొద్ది సెకన్లలో తిరిగి లేచి మరీ లైవ్ కొనసాగించింది. అయితే ఆ లైవ్‌ న్యూస్‌లోనే ఆమె గట్టిగా అరవడం, ఆ తర్వాత సదరు ఆ వాహనదారుడితో మాట్లాడటం వైరల్ వీడియోలో వినిపిస్తుంది. అయినప్పటికీ ఆమె మళ్లీ కాసేపటికి తేరుకుని తన రిపోర్టింగ్‌ని యథావిధిగా కొనసాగించడం విశేషం. టీవీ యాంకర్‌ టిమ్‌ మీరు బాగానే ఉన్నారా అని టోరీని ప్రశ్నించగా. ..ఓహ్ గాడ్,ఇప్పుడు కారు గుద్దేసింది. కానీ నేను బాగానే ఉన్నాను..టిమ్..నేను బాగానే ఉన్నాను అంటూ రిప్లై ఇచ్చింది టోరి యోర్గీ. కారు గుద్దినప్పుడు నువ్వు కింద పడిపోయావా..అసలేం జరిగింది..ఎందుకంటే స్క్రీన్‌పై ఒక్కసారిగా నువు మాకు కన్పించలేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా. నాకు కూడా తెలియదు..ఏం జరిగిందో..నా లైఫ్ ఒక్కసారిగా నా కళ్ల ముందు కన్పించిందంటూ మహిళా రిపోర్టర్ సమాధానమిచ్చింది.


ALSO READ Joe Biden : జర్నలిస్ట్ ను బండ బూతులు తిట్టిన బైడెన్

లైవ్‌లో న్యూస్‌ అందిస్తుండగా జరిగిన తొలిప్రమాదం కదా అని యాంకర్‌ టిమ్‌ రిపోర్టర్‌ టోరీని అడిగాడు. దీంతో ఆమె ఇలాంటి ప్రమాదాలు చాలా ఎదుర్కొన్నాను కానీ తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పుకొచ్చింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా ఓసారి ఇలాగే జరిగింది అంటూ మహిళా రిపోర్టర్ (Lady Reporter) సంభాషణ కొనసాగించింది. కారు గుద్దినప్పుడు నువ్వు కింద పడిపోయావా..అసలేం జరిగింది..ఎందుకంటే స్క్రీన్‌పై ఒక్కసారిగా నువు మాకు కన్పించలేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా. నాక్కూడా తెలియదు..ఏం జరిగిందో..నా లైఫ్ ఒక్కసారిగా నా కళ్ల ముందు కన్పించిందంటూ మహిళా రిపోర్టర్ సమాధానమిచ్చింది. ఈ ప్రమాదం జరిగిన తరువాత టోరీ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఇక,ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వృత్తి పట్ల టోరీ యోర్గీకు ఉన్న అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Car accident, Journalist, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు