NEWLY WED COUPLE RECEIVES PETROL AND GAS CYLINDER AS MARRIAGE GIFT IN TAMILNADU VIDEO GOES VIRAL MS
Petrol As Wedding Gift: ఐదు లీటర్ల పెట్రోలు, ఒక సిలిండర్.. కొత్త దంపతులకు స్నేహితుల వినూత్న బహుమతి
పెట్రోల్ ను బహుమతిగా ఇస్తున్న స్నేహితులు (image : Twitter)
Viral: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ జంటకు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని అనుకున్నారు వాళ్ల మిత్రబృందం. దీంతో వారికి అద్భుతమైన ఆలోచన తట్టింది. దేశంలో నానాటికీ ఆకాశానికంటుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయం వారి కంట పడింది.
మనదేశంలో పెళ్లికి ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే. పెళ్లి సందర్భంగా బంధువులు, స్నేహితులు తీసుకొచ్చే బహుమతులను దంపతులు మురిసిపోతుంటారు. అందులో కొన్ని బహుమతులను జీవితాంతం దాచుకుంటుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట వినూత్న బహుమతిని పొందింది. దేశంలో పెట్రోలు, డీజిల్, సిలిండర్ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా వాటినే బహుమతిగా ఇచ్చారు ఆ స్నేహితులు.
తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన ఆ జంటకు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని అనుకున్నారు వాళ్ల మిత్రబృందం. దీంతో వారికి అద్భుతమైన ఆలోచన తట్టింది. దేశంలో నానాటికీ ఆకాశానికంటుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయం వారి కంట పడింది. దీంతో వధూవరులకు ఇవ్వాల్సిన ప్రత్యేకమైన బహుమతేదో వారికి అర్థమైపోయింది. కొత్త పెళ్లి జంటకు ఒక సిలిండర్, ఐదు లీటర్ల పెట్రోలు, ఉల్లిపాయలతో తయారుచేసిన దండలను తయారుచేసి వారికి అందజేశారు.
ఈ బహుమతులను చూడగానే అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ సృష్టిస్తున్నది. బహుమతులు తీసుకున్నాక వధూవరులిద్దరూ తమ మిత్రులు ఇచ్చిన బహుమతులను చూసి మురిసిపోతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 100 కు చేరువలో ఉండగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే సెంచరీ దాటింది. ఇక వంట గ్యాస్ ధర కూడా సుమారు రూ. 900 గా ఉంది. ఉల్లిగడ్డలు కూడా నిన్నా మొన్నటి దాకా కిలో కు రూ. 100 దాకా పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులు వంట చేసుకోవడానికి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.