హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Lucky Couple: పెళ్లి జరిగాక హనీమూన్ పక్కన పెట్టిన దంపతులు.. వాళ్లు చేసిన పని కోట్ల వర్షం కురిపించింది.. నాలుగు రోజులకే..

Lucky Couple: పెళ్లి జరిగాక హనీమూన్ పక్కన పెట్టిన దంపతులు.. వాళ్లు చేసిన పని కోట్ల వర్షం కురిపించింది.. నాలుగు రోజులకే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొందరు కుతూరు పుట్టాక అదృష్టం వచ్చిందంటే, మరికొందరు పెళ్లి జరిగాక అదృష్టం పలకరించిందని, ఇంకొందరు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాక అంతా మంచే జరిగిందని.. ఇలా తమ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల గురించి బెబుతుంటారు.

  అదృష్టం అనేది ఎవరిని ఎప్పుడూ వరిస్తుందో తెలియదు. అయితే కొందరు జనాలు తమ అదృష్టం గురించి చెబుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తారు. కొందరు కుతూరు పుట్టాక అదృష్టం వచ్చిందంటే, మరికొందరు పెళ్లి జరిగాక అదృష్టం పలకరించిందని, ఇంకొందరు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాక అంతా మంచే జరిగిందని.. ఇలా తమ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల గురించి బెబుతుంటారు. అయితే ఓ జంటకు పెళ్లి జరిగిన కొద్ది రోజులకే జీవితం పూర్తిగా మారిపోయింది. పెళ్లి జరిగాక.. హనీమూన్ గురించి ఆలోచించకుండా ఈ జంట చేసిన పని ఇప్పుడు వారి జీవితాన్ని హ్యాపీ సాగిపోయేలా చేసింది. ఆ జంటను లాటరీ వరించింది. దీంతో వారు కోటీశ్వరులుగా మారిపోయారు. ఏకంగా రూ. 7 కోట్ల లాటరీ (lottery jackpot) గెలుపొందారు. ఈ ఘటన అమెరికాలోని లెక్సింగ్‌టన్‌లో(Lexington) చోటుచేసుకుంది.

  ఇందుకు సంబంధించిన వివరాలు.. నార్త్ కరోలినాకు చెందిన 60 ఏళ్ల మైఖేల్ ఎబెర్నెతి (Michael Abernathy) కొన్ని రోజుల కిందట వివాహం చేసున్నారు. అయితే పెళ్లి చేసుకన్న తర్వాత చాలా మంది హనీమూన్ గుర్లించి ప్లాన్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్లాలి.. ఎలా ఎంజాయ్‌ చేయాలనే ఆలోచనలో పడిపోతారు. కానీ ఈ జంట మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయింది.

  Sajjanar: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ.. వైరల్‌గా మారిన సజ్జనార్ ట్వీట్.. పోస్ట్ మాములుగా లేదుగా..


  దీంతో వారు ఎంటనే లెక్సింగ్‌టన్‌లోని షీట్జ్ స్టోర్‌కు వెళ్లారు. అక్కడ వారు $30 Millionaire Maker ticket కొనుగోలు చేశారు. అక్కడ తొలుత వారు 30 డాలర్లు గెలుచుకున్నారు. అయితే ఆ మొత్తంతో మరో రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. అందులో ఒక టికెట్ నిరాశను మిగిల్చింది. మరో టికెట్ మాత్రం వారిని కోటీశ్వరులను చేసింది. మరో టికెట్ ద్వారా వారు 1 మిలియన్ డాలర్లు.. (రూ. 7.5 కోట్లు) గెలుపొందారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్యాక్స్, ఇతర కటింగ్స్ తర్వాత మిగిలిన మొత్తం వారి సొంతం కానుంది.

  Shocking: నాపై 28 మంది అత్యాచారం జరిపారు.. మా నాన్నే ముందుగా.. బాలిక ఆవేదన.. ఎఫ్‌ఐఆ‌ర్‌లో రాజకీయ నాయకుల పేర్లు..


  పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ జంట ఎంతో సంబరపడిపోతుంది. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని హనీమూన్ కోసం కేటాయించనున్నట్టుగా ఆ జంట చెప్పింది. 2022లో తాము ఫ్లోరిడాలో హనీమూన్‌కు (honeymoon trip to Florida) ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపింది. మిగిలిన డబ్బులను సేవింగ్స్, భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయనున్నట్టుగా చెప్పింది. ఇది తాము నమ్మలేకపోయామని, అద్భుతం జరిగిందని ఆ జంట తెలిపింది. దేవుని ఆశీర్వాదం వల్లే ఇలా జరిగిందని వారు అంటున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: VIRAL NEWS

  ఉత్తమ కథలు