Home /News /trending /

Honeymoon: కొత్తగా పెళ్లైన జంట హనీమూన్​ కోసం వెళ్లి.. హోటల్​నే వెంట పెట్టుకొచ్చారు.. అసలేమైందంటే?

Honeymoon: కొత్తగా పెళ్లైన జంట హనీమూన్​ కోసం వెళ్లి.. హోటల్​నే వెంట పెట్టుకొచ్చారు.. అసలేమైందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎవరైనా హనీమూన్​కి వెళ్లి ఏం చేస్తారు. మంచి మంచి జ్ఞాపకాలను(memories) వెంట తెచ్చుకుంటారు. కానీ, ఈ జంట ఓ హోటల్​నే వెంట తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా దంపతులు ఎక్కడ జరిగిందో ఓ సారి తెలుసుకుందాం

  కొత్తగా పెళ్లైన ఓ జంట శ్రీలంక (Srilanka)లోని హనీమూన్​కి వెళ్లింది. వెళితే వెళ్లారు కానీ, ఆ హనీమూనే ప్రాంతం వారిని జీవితాన్నే(life) మార్చేసింది. అంత స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా? మరీ అంత కాదు.. కానీ, ఆ జంట తీసుకున్న నిర్ణయం అందిరనీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా ఆ హాటల్​నే కొనేశారు. ఇపుడు ఆ హోటల్​కే కస్టమర్లను ఆహ్వానిస్తున్నారు. ఇక వారు చేసిన పనిని చూసి స్నేహితులు, బంధువులు అవాక్కయ్యారంటే నమ్మండి. ఎవరైనా హనీమూన్​కి వెళ్లి ఏం చేస్తారు. మంచి మంచి జ్ఞాపకాలను(memories) వెంట తెచ్చుకుంటారు. కానీ, ఈ జంట ఓ హోటల్​నే వెంట తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా దంపతులు ఎక్కడ జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.. శ్రీలంకలో హనీమూన్(honeymoon) గడపడానికి వచ్చిన ఓ బ్రిటీష్ జంట.. తాగిన మైకంలో ఈ నిర్ణయాన్ని తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్(England) దేశానికి చెందిన మార్క్ లీ(mark lee) దంపతులు శ్రీలంకలో ఓ బీచ్ రిసార్ట్‌(resort)లో గడపడానికి వచ్చారు. బాగా రాత్రి అయ్యాక.. బయట మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వారికి లోపలి నుంచి కొన్ని మాటలు వినిపించాయి.

  ఆ రోజుతో వారి దిగిన హోటల్(hotel) నిర్వహణ కోసం చేసుకున్న లీజు అగ్రిమెంట్ ముగుస్తుందని.. మరుసటి రోజు నుంచి హోటల్ క్లోజ్​ అవుతుందని యజమానులు మాట్లాడుకోవడం వీరి చెవిన పడింది. అంతే.. మార్క్ లీ జంటకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. తమ హనీమూన్‌కు కేరాఫ్ అడ్రస్​గా మారిన ఆ బీచ్ రిసార్టును తామే లీజు(lease)కు తీసుకుంటే ఎలాగుంటుందని అనుకున్నారు. బాగా తాగి ఉన్నా కూడా.. వెంటనే హోటల్(hotel) లోపలికి వెళ్లి ఇదే విషయాన్ని హోటల్​ వారికి చెప్పారు. కావాలంటే.. అడ్వాన్స్ కూడా తీసుకోండని కొంత సొమ్ము వారి చేతిలో పెట్టారు. ఈ జంట వింత ప్రవర్తనకు యజమానులు ఆశ్చర్యపోయినా.. మంచి బేరం దొరికినందుకు సంతోషించారు. అయితే వీరి డిమాండ్​ చేసి.. రేటును అమాంతం పెంచేశారు. మూడు సంవత్సరాల(three years) లీజుకు 30,000 పౌండ్లు అని డిమాండ్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 30 లక్షల రూపాయలు అన్నమాట.

  అయినా మార్క్ లీ జంట అదరలేదు.. బెదరలేదు. డబ్బులిచ్చి అగ్రిమెంట్(agreement) చేసేసుకున్నారు. మరుసటి రోజు హోటల్ పేరు కూడా మార్చేశారు. తమకు లక్ తీసుకొచ్చి పెట్టిన ఆ హోటల్‌కి లక్కీ బీచ్ టాంగ్లే అని పేరు పెట్టారు. ఏదో సరదాగా హానిమూన్ ఎంజాయ్ చేయాలని వచ్చిన తాము.. ఓ హోటల్‌కి యజమానులమవుతామని(owners) అసలు ఊహించలేదని అంటున్నారు ఆ జంట. ఏదేమైనా.. బహు చిత్రంగా ఉంది కదా.. ఈ బ్రిటీష్ జంట కథ. అయితే స్నేహితులు మాత్రం వెళితే వెళ్లారు.. హనీమూన్​కు వెళ్లిన ఎవరి జీవితంలోకి అయినా పిల్లలు వస్తారు..కానీ, వీరి లైఫ్​లోకి హోటల్ వచ్చిందని సెటైర్లు వేసుకుంటున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bar and restaurants, Couples, England, Honey

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు