• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NEW ZEALAND MP TAKES OATH IN SANSKRIT SECOND INDIAN ORIGIN PERSON TO DO SO NS

సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం.. స్వదేశంపై అభిమానాన్ని చాటిన యువ వైద్యుడు

సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం.. స్వదేశంపై అభిమానాన్ని చాటిన యువ వైద్యుడు

ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవ్ శర్మ(Credit: Twitter)

ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు గౌరవ్ శర్మ ఎంపీగా గెలుపొందారు. అయితే ఆయన ఎంపీగా తన ప్రమాణ స్వీకరాన్ని సంస్కృత భాషలో చేసి భారత్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా చాటారు.

  • Share this:
    ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు గౌరవ్ శర్మ ఎంపీగా గెలుపొందారు. అయితే ఆయన ఎంపీగా తన ప్రమాణ స్వీకరాన్ని సంస్కృత భాషలో చేసి భారత్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా చాటారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన గౌరవ్ హమిల్టన్ వెస్ట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బుధవారం న్యూజిలాండ్ పార్లమెంట్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట స్థానిక భాష మౌరిలోనూ, ఆపై సంస్కృతంలో గౌరవ్ ప్రమాణం చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో భారత దౌత్యాధికారి ముక్తేశ్ పర్దేశి వివరాలను వెల్లడించారు. ఈ విధంగా రెండు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను గౌరవించేలా గౌరవ్ నడచుకున్నారని అభినందించారు. గౌరవ్ శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం వాషింగ్టన్‌లో ఎంబీఏ చేశారు.

    అయితే ఓ నెటిజన్ గౌరవ్ శర్మను హిందీలో ఎందుకు ప్రమాణం చేయలేదని గౌరవ్ శర్మన్ ను అడగగా ఆయన స్పందించారు. సంస్కృతంలో ప్రమాణం చేస్తే భారతీయ భాషలన్నింటికీ గౌరవం దక్కుతుందన్నారు. 3500 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న భాష సంస్కృతం అని ఆయన కొనియాడారు. సంస్కృతం అనేక భారతీయ భాషలకు అమ్మలాంటిదన్నారు.





    అయితే.. ప్రియాంక రాధాకృష్ణన్ అనే భారత సంతతికి చెందిన మరో మహిళ న్యూజిలాండ్ ప్రభుత్వంలో ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా.. ప్రియాంక తన మాతృభాష అయిన మళయాలంలోనే ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. అయితే గౌరవ్ శర్మ ప్ర‌మాణ స్వీకారం వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సంస్కృతంలో ప్రమాణ స్వీకరం చేయడంపై అనేక మంది ఆయనను అభినందిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: