రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి కంగుతిన్న వెయిటర్.. అదేంటని అడిగితే ఆమె చెప్పింది విని..

ఉల్యానా హ్రుష్కక్, రాబిన్ (ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు)

ఓ ఫేమస్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసే యువతికి ఊహించని అనుభవం ఎదురయింది. ఓ మహిళ ఆర్డర్ ఇస్తే తన బాధ్యతగా తెచ్చి ఇచ్చింది. ఆమెకు ఏమేం కావాలో చూసుకుంది. ఆర్డర్ ముగిసిన తర్వాత బిల్లు చెల్లించేటప్పుడు టిప్ రూపంలో ఏకంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది.

 • Share this:
  కొన్ని సార్లు కొందరు వ్యక్తులకు అడక్కుండానే ఊహించనంత డబ్బు వారి చేతుల్లోకి వచ్చి చేరుతుంది. ప్రతిఫలం కోసం ఆశించకుండా తమ పనిలో నిబద్ధతను చూపేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందనడానికి అలాంటి ఘటనలే ఉదాహరణగా నిలుస్తుంటాయి. గుర్తు తెలియని వ్యక్తుల రూపంలో వచ్చి ఆ దేవుడే వారికి ప్రతిఫలాన్ని అందిస్తుంటాడని అనుకుంటుంటారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ ఫేమస్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసే యువతికి ఊహించని అనుభవం ఎదురయింది. ఓ మహిళ ఆర్డర్ ఇస్తే తన బాధ్యతగా తెచ్చి ఇచ్చింది. ఆమెకు ఏమేం కావాలో చూసుకుంది. ఆర్డర్ ముగిసిన తర్వాత బిల్లు చెల్లించేటప్పుడు టిప్ రూపంలో ఏకంగా ఏడు వేల డాలర్లను(దాదాపు ఐదు లక్షల రూపాయలు) ఇచ్చింది. ఇదేంటని అడిగితే, ఈ డబ్బులను ఇచ్చింది నేను కూడా కాదంటూ మరో షాకింగ్ నిజాన్ని చెప్పింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
  ఇది కూడా చదవండి: అదృష్టం అంటే అతనిదే.. 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికింది.. ఎక్కడంటే..?

  న్యూయార్క్ రాష్ట్రంలోని లిల్లీస్ కాక్ టైల్ అండ్ వైన్ మన్హత్తన్ అనే రెస్టారెంట్ కమ్ పబ్ ఉంది. దీంట్లో ఉల్యానా హ్రుష్కక్ అనే 24 ఏళ్ల యువతి వెయిటర్ గా పనిచేస్తోంది. గత మంగళవారం రాబిన్ అనే మహిళ వచ్చింది. తనకు తానుగా ఓ కమెడియన్ ను అని చెప్పుకుంది. తనకు కావాల్సిన భోజనాన్ని, డ్రింక్ ను ఆర్డర్ ఇచ్చింది. అదే సమయంలో ఉల్యానా వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత ఉల్యానా తన పనిలో తాను పడింది. ఆమె పనితీరు పట్ల రాబిన్ ఫిదా అయింది. అందరూ మాస్కు వేసుకున్నారా? లేదా అనిచూడటం, వ్యక్తిగత దూరం పాటించేలా చేయడం అన్నీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తోంది. కస్టమర్లకు కావాల్సినవన్నీ నీట్ గా తెచ్చిఇస్తోంది.
  రెస్టారెంట్ కు వచ్చిన రాబిన్ కు ఇన్ స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అప్పటికప్పుడే ఓ లైవ్ ను స్టార్ట్ చేసింది. రెస్టారెంట్లో పనిచేస్తున్న ఉల్యానా గురించి చెబుతూ ఆమె పనితీరు గురించి వివరించింది. ‘ఆమెకు సాయం చేసి మరింత ప్రోత్సహించేందుకు ముందుకు రండి. ఈ అకౌంట్ లో మీకు తోచినంత ఇవ్వండి‘ అంటూ తన ఫాలోవర్స్ ను కోరింది. అంతే ఆ లైవ్ దాదాపుగా గంటన్నర సేపు జరిగింది. ఈ గంటన్నరలో 13వేల డాలర్లు కలెక్టయ్యాయి. ఆమె తన ఆహారాన్ని తిని బిల్లు చెల్లించేందుకు వెయిటర్ ను పిలిచింది. ఉల్యానా వచ్చినప్పుడు బిల్లుతోపాటు మరో చెక్కు కూడా ఇచ్చింది. ఆ చెక్కుపై 7000 డాలర్లు ఉండటం చూసి ఇదేంటని అడిగింది. నీ పనితీరు మెచ్చి నా ఫాలోవర్స్ నీకు ఇచ్చిన చిన్న బహుమతి అంటూ రాబిన్ చెప్పడంతో ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయింది. తనకు సాయం చేసిన ప్రతీఒక్క నెటిజన్ కు ధన్యవాదాలు చెప్పుకుంది. ఈ ఘటన కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మిగిలిన మొత్తాన్ని కూడా రాబిన్ ఆ రెస్టారెంట్లోని ఇతర సిబ్బందికి పంచడం గమనార్హం.
  Published by:Hasaan Kandula
  First published: