ఆపిల్‌కు భారీ షాక్.. రూ.7వేల కోట్ల దావా వేసిన 18 ఏళ్ల కుర్రాడు

ఆపిల్ స్టోర్‌లో దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఉస్మాన్ బా ను న్యూయార్క్ పోలీసులు గత నవంబరులో అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 23, 2019, 7:23 PM IST
ఆపిల్‌కు భారీ షాక్.. రూ.7వేల కోట్ల దావా వేసిన 18 ఏళ్ల కుర్రాడు
ఆపిల్
  • Share this:
తప్పుడు ఆరోపణలతో తనను అరెస్టు చేయించారని ఓ 18 ఏళ్ల కుర్రాడు ప్రముఖ సంస్థ ఆపిల్‌పై రూ.7వేల కోట్ల దావా వేశాడు. తన పరువు తీసినందుకు ఈ మొత్తం చెల్లించేలా ఆ సంస్థను ఆదేశించాలని కోర్టును ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే.. ఉస్మాన్ బా అనే విద్యార్థి నాన్-ఫొటో లర్నర్స్ పర్మిట్‌ డ్రైవింగ్ లైసెన్సును ఎవరో దొంగతనం చేశారు. ఆ పర్మిట్‌తో ఓ ఆపిల్ స్టోర్‌లో అడుగుపెట్టిన దొంగ అక్కడి వస్తువులను దొంగిలించాడు. అది తెలిసిన ఆపిల్ సంస్థ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా స్కాన్ చేయగా ఉస్మాన్ వివరాలు తెలిశాయి. అతడే దొంగ అని అనుకొని న్యూయార్క్ పోలీసుల చేత గత నవంబరులో అరెస్టు చేయించింది.

తాను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినకుండా తప్పుడు కేసులు బనాయించింది. చేయని తప్పుకు తనపై అభాండాలు వేసిందని, తప్పుడు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తనను అన్యాయంగా ఇరికించిందని ఆ కుర్రాడు సోమవారం కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ ఘటనతో తాను కుమిలిపోయానని, మానసికంగా వేధన అనుభవించానని, అందుకు ప్రతిఫలంగా తనకు ఆ డబ్బు చెల్లించేలా చూడాలని జడ్జిని కోరాడు.
First published: April 23, 2019, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading