ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రజలను ఆలోచింపజేసే పోస్టులు, ఆశ్చర్యపరిచే ఫోటోలు, ఆహ్లాదాన్ని పంచే వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. ఇవి క్షణాల్లోనే వైరల్ అవ్వడం కూడా సాధారణ విషయమే. ఆనంద్ మహీంద్రా తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారతీయులకు బాగా తెలిసిన స్టీల్ టిఫిన్ బాక్సు నేపథ్యం ఉన్న ఫోటోను ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. ఒక మహిళ స్టీల్ టిఫిన్ పట్టుకుని దారిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తోంది. "న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా ఆగస్టు 19న ఈ ఫోటోను ట్వీట్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ఫోటో తీసినట్లు పేర్కొన్నారు. ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ స్టీల్ డబ్బాను తీసుకెళ్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. దీంతో స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో బలమైన అనుబంధం ఉన్న భారతీయులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం మన దగ్గర సాధారణ విషయం. భారత్‌లో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు ఆహారాన్ని తీసుకెళ్లడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే న్యూయార్క్‌లో కూడా ఒక మహిళ స్టీల్ డబ్బాను తీసుకెళ్లడం చూసి సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.
* ఫన్నీ కామెంట్లతో నెటిజన్ల సందడి
ఈ ఫోటోకు ఇప్పటి వరకు 16 వేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. వందలాది మంది నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌ను ఫన్నీ మెసేజ్‌లతో నింపేస్తున్నారు. ‘ఆమె ఇండియన్ కావచ్చు. కేవలం భారతీయులే అక్కడ అమెరికన్ డాలర్లను ఫుడ్ కోసం ఖర్చు చేయకుండా.. ఇంట్లో చేసిన ఆహారాన్ని ఇష్టపడతారు’ అని ఒక వ్యక్తి కామెంట్ రాశాడు.
What you have to say about this one? pic.twitter.com/4e4w0rXT8f
— Akshit Soni (@akshitsoni_) August 19, 2021
"లోపల ఏముందని ఆశ్చర్యపోతున్నారా? ఇంకేం ఉంటాయి.. రొట్టె, పప్పు లేదంటే బర్గర్, శాండ్‌విచ్‌లు" అని ఒక వ్యక్తి ఫన్నీ కామెంట్ రాశాడు. “భారతీయులు ప్రపంచంలోని ప్రతి మూలలోనూ ఉన్నారు. మనం విదేశాల్లో ఎంత ఆధునికంగా ఉన్నా, మన రక్తం, సంస్కృతి మారదు. అందుకు ఈ స్టీల్ క్యారేజ్ ఉదాహరణ” అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, New york, Viral tweet