Happy New Year 2021 Wishes: అయినవారికి ఆత్మీయంగా ఇలా విషెస్ చెప్పండి

న్యూ ఇయర్ 2021

కొత్త సంవత్సరం విషెస్ సరికొత్తగా చెప్పి, ఇంప్రెషన్ కొట్టేయవచ్చు. మీ బాస్ లేదా మీ అత్త, మామాలకు వెరైటీగా విషెస్ చెప్పాలంటే వెరైటీగా ఆలోచించాల్సిందే.

  • Share this:
కొత్త సంవత్సరం విషెస్ సరికొత్తగా చెప్పి, ఇంప్రెషన్ కొట్టేయవచ్చు. మీ బాస్ లేదా మీ అత్త, మామాలకు వెరైటీగా విషెస్ చెప్పాలంటే వెరైటీగా ఆలోచించాల్సిందే. వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో మీకు తెలుసుకదా దానికి సూటబుల్ గా ఉండేలా విషెస్ చెప్పండి. మీ అత్తగారికి సీరియళ్లు ఇష్టమంటే ఆమెకు నచ్చిన సీరియళ్ల పేర్లతో చక్కగా విషెస్ మీరే రాయండి.. ఆవిడ చూసిన పాత సీరియళ్లు, ప్రస్తుతం ఫాలో అవుతున్న కొత్త సీరియళ్ల కలబోతతో ఈ Happy New Year Wishes ఉంటే కచ్ఛితంగా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో జస్ట్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ తో మీరు ఈ రియాక్షన్ చూడలేరు. ఇక మీ బాస్ కు కొత్త సంవత్సరం విషెస్ చెప్పాలంటే .. "మీరు మాకు బాస్ గా మాత్రమే కాదు.. చక్కని శ్రేయోభిలాషిలా, గైడ్ గా వ్యక్తిగతంగా అండగా నిలుస్తూ మాకు భరోసా ఇచ్చే ఆత్మీయులుగా నిలుస్తున్నారు.. మీకు 2021 Happy New Year బాస్" అంటూ గౌరవంగా ఓ మెసేజ్ పెడితే ఆయన పొంగిపోవచ్చు. మీ మెసేజ్ అందుకున్న వారిలో ఉత్సాహం, ఆనందం పెల్లుబికేలా చేస్తే అది వారి అంతరాత్మను సుతారంగా టచ్ చేస్తే అప్పుడు వారు ఎంతో హ్యాపినెస్ ఫీల్ అవుతారు. ఇదే మీ విషెస్ స్పెషాలిటీ అయ్యేలా ప్రయత్నించి చూడండి.

పాజిటివ్ ఫీలింగ్ తో..
కరోనా లేని కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం అనే పాజిటివ్ ఫీలింగ్ తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. "మనమంతా ఆరోగ్యకరమైన ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభవేళ Happy New Year” అంటూ ఓ విషెస్ పెట్టిచూడండి. మోటివేషనల్ కోట్స్ (motivational quotes) విషయానికి వస్తే ఇంటర్నెట్ లో ఇబ్బడిముబ్బడిగా ఈ సరుకు మీకు దొరుకుతుంది.

-"అత్యద్భుత కాలం ముందుంది.. Happy New Year 2021” .

-“2021లో 365 హెల్తీ డేస్ లోకి వెల్కం మై డియర్.. Happy New Year 2021".

-“ఆపర్చునిటీస్ కల్పించే మహా సముద్రం 2021 .. కొత్త ఏడాదిలో మనం కలిసి ప్రయాణం చేద్దాం.. మన కలల్ని సాకారం చేసుకుందాం.. Happy New Year 2021".

వెరైటీ విషెస్ చెప్పటం ఎలా?
2020 చేదు అనుభవాలు మరిచిపోయేలా కొత్త సంవత్సరం మీకు గొప్పగా ఉండాలని సింపుల్ గా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి ఊరుకోకుండా మీరు భిన్నంగా విషెస్ చెప్పాలనుకుంటే, మీ బుర్రకు పనిచెప్పాల్సిందే. మీరు ఎవరికి విషెస్ చెబుతున్నారో వారి టేస్ట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కనుక.. వారికి కవిత్వం ఇష్టమైతే కవిత్వంతోనే హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. లేదు వారు ఫుడీలు అనుకోండి అప్పుడు వారి ఫేవరెట్ ఫుడ్ తోనే విషెస్ చెప్పండి. మీరు విషెస్ చెబుతున్నవారు పొదుపరులనుకోండి.. వారికి మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సులు, ఎఫ్డీలు, ఇన్వెంస్ట్మెంట్స్ వంటి సబ్జెక్టులను ప్రయోగించి వెరైటీగా విషెస్ చెప్పచ్చు. లేదా వారు ఫ్యాషనిస్టాలు అనుకోండి.. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తో వారికి విషెస్ చెప్పండి. ఇలా ఎదుటివారి మనసెరిగి మీరు సొంతంగా కోట్ రాసి, విషెస్ చెబితే.. మీ ఆత్మీయులు చాలా సంతోషిస్తారు. ఏదో పాపులర్ కోట్స్, వాట్సప్ పార్వర్డులు, ఇన్స్టా పోస్టులను షేర్ చేస్తే వెరైటీ ఏముంది. మీరు చెప్పే విషెస్ ఏస్థాయిలో ఉన్నాయి అన్నదాన్నిబట్టి మీరు వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఇట్టే అర్థమైపోతుంది. లోతైనా అర్థాలు వచ్చే అర్థవంతమైన మెసేజ్ చెప్పటంలో మంచి థ్రిల్ ఉందికూడా.

స్పాంటేనిటీ ఉంటే కిక్ వస్తుంది..
అయిన వారికి న్యూ ఇయర్ మెసేజెస్ పెట్టే సమయంలో కాస్త సమయస్ఫూర్తి, భాషతో ప్రయోగం, వారి అభిరుచులు, వారి మనస్తత్వం గుర్తెరిగి 2021 విషెస్ చెప్పేందుకు ప్రయత్నించండి .. మీనుంచి ఇలా వెరైటీ విషెస్ అందుకున్నవారి స్పందన చూడండి.. మీరు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆ ఫీడ్ బ్యాక్. మీకు బెంగాలీ ఫ్రెండ్ ఉంటే బెంగాలీలో విషెస్ చెప్పేందుకు గూగుల్ ట్రాన్స్ లేటర్ సాయం తీసుకోండి.. ముందు మీరు తెలుగులో రాసుకున్న సొంత మెసేజ్ ను బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేసి పంపండి. చిన్న తప్పులున్నా ఫర్లేదు లెండి..అలాగని మరీ పెద్ద మిస్టేక్స్ లేకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందే. మీ ప్రయత్నాన్ని వారు తప్పక అభినందిస్తారు.

స్టిక్కర్స్ వచ్చాయోచ్..
Happy New Year Wishes చెప్పేందుకు వాట్సాప్‌లో కొన్ని స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది కనుక న్యూఇయర్ విషెస్ ఇలా స్టిక్కర్స్ ద్వారా పంపండి. వాట్సాప్ స్టిక్కర్స్ , జీఐఎఫ్‌లు అందుబాటులో ఉన్నా సరైన మెసేజెస్ సెలెక్ట్ చేసుకునేందుకు మంచి యాప్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

కర్టసీ విషెస్ చాలనుకుంటే..
అయినా మీకు టైం లేదు.. కానీ కర్టసీ విషెస్ చెప్పాలంటే మెయిల్ లేదా, వాట్సప్ లేదా ఇన్స్టా గ్రాం, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్క్ ద్వారా.. ఈ కింది లింక్స్ లోని మెసెజెస్ పిక్ చేసుకుని మీకు కావాల్సిన వారికి వాటిని షేర్ చేయండి.

https://www.wow4u.com/

https://in.pinterest.com/newyeareve2021

https://123statuslines.com/happy-new-year-quotes

https://www.ftd.com/blog/celebrate/happy-new-year-quotes

teluguwishes.com/

https://quotereadz.com/happy-new-year
Published by:Sumanth Kanukula
First published: