హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Delhi | Tea : వేడి వేడి టీ, కాఫీ తాగి గ్లాసులు తినొచ్చు .. ఎక్కడో ఈ వీడియో చూడండి

Delhi | Tea : వేడి వేడి టీ, కాఫీ తాగి గ్లాసులు తినొచ్చు .. ఎక్కడో ఈ వీడియో చూడండి

Edible tea(Photo:Youtube)

Edible tea(Photo:Youtube)

Delhi|Tea: ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కొత్త రకం టీని కనిపెట్టాడు. ఇందులో అతను కనిపెట్టింది తాగే టీని కాదు తినే టీని. అవును మేం చెబుతోందినిజం. ఢిల్లీలో టీ తాగిన గ్లాసును పడేయకుండా తినేయవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఇండియా(India)లో టీ తాగే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎంతలా అంటే దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు టీ (Tea)తాగే అలవాటు ఉన్నవాళ్లు ఉంటున్నారు. టీ తాగే వాళ్ల సంఖ్య పెరుగుతోంది కాబట్టే అందుకు తగినట్లుగా అనేక రకాల రుచుల టీలు అందుబాటులోకి వస్తున్నాయి. టీని పాలతో తయారు చేసినప్పటికి అందులో అల్లం, యాలకులు, తేనే, పుదినా ఆకులు ఇతర దినుసులు వేస్తూ అనేక రకాల పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇదంతా రొటీన్‌గా ఉందని ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కొత్త రకం టీని కనిపెట్టాడు. ఇందులో అతను కనిపెట్టింది తాగే టీని కాదు తినే టీని(Edible tea). అవును మీరు వింటున్నది నిజమే..ఢిల్లీ(Delhi)లో టీ తాగిన గ్లాసును పడేయకుండా తినేయవచ్చు. ఇప్పుడు దేశ రాజధానిలో ఈ రకం టీలకు డిమాండ్ బాగా పెరిగింది.

Sad news: ఇంట్లో టీ తాగి ఐదుగురు మృతి .. ఎందుకు..? ఎక్కడ జరిగిందంటే

టీ తాగి గ్లాస్ తినవచ్చు..

టీ తాగే అలవాటు చాలా మందిలో ఓ వ్యసనంగా మారింది. కాస్త తలనొప్పిగా ఉన్నా, కాలక్షేపం కోసం, లేదంటే ఇద్దరు స్నేహితులు కలిసినా అది కాదంటే ఒంటరిగా ఉన్నా టీ ఇచ్చే రిలీఫ్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే టీ సెంటర్‌లు, అనేక రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొత్త వెరైటీ టీలు తయారు చేస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద నివాస కాలనీ రోహిణిలోని శివచౌక్ చాలా ప్రసిద్ధి చెందింది. కొత్త టీ సెంటర్‌ను ఇక్కడ ప్రారంభించారు. 'ఇష్క్-ఎ-చాయ్' పేరుతో తోపుడు బండిపై ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో రెగ్యులర్‌గా దొరికే అన్నీ టీలు ఉంటాయి.

ఢిల్లీలో కొత్త రకం టీ..

భారత్‌తో అత్యధికంగా తాగే అల్లం, ఏలకులతో కూడిన బలమైన టీతో పాటు బటర్ స్కాచ్, రోజ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌తో కూడిన టీ ఉంటుంది. అయితే వీటన్నింటికంటే వెరైటీ టీని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అదేమిటంటే కుల్హద్ అంటే కోన్ ఐస్‌క్రీంను తయారు చేసే బిస్కెట్‌లో పెట్టే విధంగా టీని కూడా అలాంటి తినదగిన పదార్ధంతో గ్లాసుగా తయారు చేసి అందులో టీ పోసి ఇస్తారు. అయితే ఢిల్లీ లాంటి రాజధాని నగరంలో ఇప్పుడు తాగే టీ కాకుండా తినదగిన టీని స్టార్టప్‌గా ఎంచుకొని బాగా పాపులర్ అయ్యాడు ఓ యువకుడు. టీ తాగిన తర్వాత ఆ గ్లాస్‌ని తినేసే విధంగా తయారు చేశాడు.

తినదగిన టీకి ఫుల్ డిమాండ్..

అయితే ఈ చావ్‌ వాలా దగ్గర తినదగిన టీ మాత్రమే కాదు మట్టి గ్లాసుల్లో, డిస్పోజల్‌ గ్లాసులతో పాటు గాజు గ్లాసులో కూడా టీ విక్రయిస్తూ ఉన్నాడు. అన్నీ చోట్ల డిస్కోజపుల్ గ్లాసుల్లో టీ దొరుకుతుంటే కేవలం రోహిణిలోని శివచౌక్‌లో ఈ విధంగా తినదగిన టీ విక్రయించడంతో అందరూ బాగా అలవాటు పడుతున్నారు. మందపాటి శంకువులతో తయారు చేసే ఈ తినదగిన గ్లాసుల్లో టీ పోసిన తర్వాత 20నిమిషాల తర్వాత కలిగిపోతుంది. కాబట్టి టీ తాగిన వెంటనే గ్లాస్‌ను తినేయవచ్చు.

Viral video: రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ట్రైన్ బోగీపైకి ఎక్కాడో యువకుడు.. ఏం చేశాడో ఈ వీడియో చూడండి

చాయ్‌ వాలా ఐడియా సూపర్..

ఈరకం టీను అమ్ముతున్న చాయ్‌ వాలా మసాలా టీని డిస్పోజబుల్ గ్లాసులో కావాలంటే 10 రూపాయలు ఆ తర్వాత తినదగిన గ్లాసుల్లో టీ కావాలంటే 15,20రూపాయల ధరల్లో సైజులు పెంచుకుంటూ టీని విక్రయిస్తున్నాడు.అదే విధంగా ప్లెయిన్ కాఫీ 25 రూపాయలు, ఫిల్టర్ కాఫీ 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు. పాట్నాలో గ్రాడ్యుయేషన్ చేసిన రవికుమార్ ఈ వ్యాపారంలో దిగాడు. ఈ తినదగిన టీ స్టాల్ పెట్టక ముందు ఓ మొబైల్ కంపెనీలో స్టోర్ మేనేజర్‌గా పని చేశాడు.

First published:

Tags: Delhi news, Tea, Trending news

ఉత్తమ కథలు