హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Affairs : వివాహేతర సంబంధాలు..సెప్టెంబర్ నెల ఉత్తమ సమయమంట!

Affairs : వివాహేతర సంబంధాలు..సెప్టెంబర్ నెల ఉత్తమ సమయమంట!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

 Best month for cheaters : ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభూతి ప్రేమ(Love). ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం అందంగా కనిపించడం ప్రారంభమవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Best month for cheaters : ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభూతి ప్రేమ(Love). ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం అందంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అంతా ఆనందంగా మారుతుంది. మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. కానీ ఈ ప్రేమ మోసగించబడినప్పుడు, ప్రతిదీ నాశనం అవుతుంది. ప్రపంచం నిర్జనమైపోతుంది. ప్రేమలో సందేహాలకు తావు లేనప్పటికీ కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎదుటివారిని అనుమానించడానికి బలవంతం చేస్తాయి. మోసానికి ఆస్కారం ఉండడమే ఇందుకు కారణం. అయితే ప్రేమలో మోసగాళ్లను(Cheaters in love) గుర్తించేందుకు IllicitEncounters.com సరికొత్త మార్గాన్ని కనిపెట్టింది.

సెప్టెంబర్ నుండి జాగ్రత్త వహించండి

సెక్స్ టెంబర్‌గా ప్రసిద్ధి చెందిన ఈ సైట్ సర్వే చేసి సెప్టెంబర్ నెలలో ఎవరైనా ఎక్కువగా మోసం(Cheating) చేయడం ప్రారంభిస్తారని కనుగొన్నారు. ఇతర నెలల కంటే ఈ నెలలో 22 శాతం ఎక్కువ చీటింగ్ కేసులు ప్రారంభమయ్యాయి. ఈ అధ్యయనంలో 32 శాతం మంది మహిళలు,34 శాతం మంది పురుషులు వేసవి తర్వాత సెప్టెంబర్ నెల నుండి తమ భాగస్వాములను మోసం(Cheating Partners) చేయడం ప్రారంభిస్తారని కనుగొనబడింది.

Palmistry : ఈ రేఖ అదృష్టవంతుల చేతుల్లో మాత్రమే ఉంటుంది..ఇది ఉంటే ఎల్లప్పుడూ విజయమే!

ఇదే మోసానికి ప్రధాన కారణమని తేలింది

అధ్యయనంలోvమోసగాళ్లపై లోతైన అధ్యయనం జరిగింది. మోసపూరిత స్వభావం ఉన్నవారు ఒకే భాగస్వామితో జీవిస్తున్నప్పుడు విసుగు చెందుతారని తెరపైకి వచ్చింది. వారు తమ భాగస్వాముల పట్ల తక్కువ ఆకర్షణను పొందడం ప్రారంభిస్తారు. దీనివల్ల చాలా మోసాలు మొదలవుతాయి. ఇది కాకుండా, మోసం కేసులు పెరగడానికి ఒక కారణం ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్(Work from home)ముగియడం. 21 శాతం మంది పురుషులు, 19 శాతం మంది మహిళలు ఆఫీసుకు వెళ్లి భాగస్వామిని మోసం చేసేందుకు వెనుకాడరని అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వేలో రెండు వేల మంది పాల్గొన్నారు. ముందుగా జనవరి నెలను మోసగాళ్ల నెల అని పిలిచేవారు. కానీ ఇప్పుడు దాని స్థానంలో సెప్టెంబర్ వచ్చింది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Extramarital affairs, Survey

ఉత్తమ కథలు