షార్క్ చేపలు నడవడం అనేది ఓ ఊహ మాత్రమే. ఇప్పటివరకూ అందుకు ఆధారాలు లేవు. తాజాగా... ఆ ఊహ నిజమైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు... నడుస్తూ వెళ్తున్న షార్క్ చేపను చూశారు. అది తన రెక్కలను కాళ్లలా ఉపయోగిస్తూ... సముద్రం అడుగున ఇసుకలో ముందుకు వెళ్తూ కనిపించింది. షార్కుల్లో చాలా జాతులున్నాయి. వాటిలో ఇది కొత్త రకం జాతి. ఈ పరిశోధన ద్వారా ఓ విషయం అర్థమవుతోంది. నీరు లేని ప్రాంతాల్లో షార్క్ చేపలు... నడుస్తూ వెళ్లి... నీరు ఉన్న చోటికి చేరగలవని తెలుస్తోంది. మొత్తం నాలుగు రకాల జాతుల షార్క్ చేపలు... ఇలా నడవగులుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
New species of 'walking' sharks discovered in Australia. These sharks can walk with their fins on dry land for a while. 🦈 pic.twitter.com/auak5KEJPU
— Saycheese TV 👄🧀 (@SaycheeseDGTL) July 11, 2020
ఈ నడిచే షార్కులు... ఆస్ట్రేలియా ఉత్తర జలాల్లో కనిపిస్తున్నాయి. ఇవి పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించట్లేదు. మిగతా చేపలు పెద్దగా లేని ప్రదేశాల్లోనే ఉంటున్నాయి. జనరల్‌గా చేపలు ఈదడానికి ఇష్టపడతాయి. ఇవి మాత్రం నడుస్తూ వెళ్లడానికి ఇష్టపడుతున్నాయి. దీని వల్ల అవి... పగడపు దిబ్బల్లోకి ఈజీగా వెళ్లగలుగుతున్నాయి. అక్కడున్న చిన్న చేపలు, నత్తలను తినగలుగుతున్నాయి.
ఈ చేపలు... మైలు దూరం కంటే ఎక్కువకు వెళ్లట్లేదు. అక్కడక్కడే తిరుగుతూ... అక్కడే జీవిస్తున్నాయి. సృష్టి ఆవిర్భవించిన కొత్తలో చాలా జీవులు... నీటిలోనే పుట్టాయనీ... క్రమంగా అవి నడవడం అలవాటు చేసుకొని... భూమిపైకి వచ్చేయడంతో... వాటికి కాళ్లు, చేతులూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ పరిణామ క్రమంలో ఇదంతా జరిగిందంటున్నారు. తాజాగా షార్కులు నడవటానికి ఇష్టపడటం కూడా అలాంటిదే అంటున్నారు. ప్రస్తుతం క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ, ఫ్లోరిడా యూనివర్శిటీ ప్రొఫెసర్లు... ఈ దిశగా లోతైన పరిశోధనలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS, Viral Videos, Youtube