రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త థండర్‌బర్డ్ బైక్.. తక్కువ ధరకే అందుబాటులోకి..

సామాన్యులకు కూడా దగ్గరయ్యేలా కాస్త తక్కువ ధరకే థండర్ బర్డ్ 350 మోడల్ బైక్‌లను ప్రవేశపెట్టబోతోంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ. ఈ మోడల్ బైక్ ధర రూ.1.57 లక్షలు(ఢిల్లీ ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 26, 2019, 12:30 PM IST
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త థండర్‌బర్డ్ బైక్.. తక్కువ ధరకే అందుబాటులోకి..
రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350
  • Share this:
ఎన్ని బైక్‌లు ఉన్నా రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే నిజంగా రాజసమే. జీవితంలో ఎప్పుడైనా సరే ఆ బైక్ కొనాలని ఆరాటపడే సామాన్య బైక్ ప్రియులెందరో. మీసాలు మెలేసి, తెల్ల కుర్తా వేసుకొని, కళ్లద్దాలు పెట్టుకొని.. ఆ బైక్‌పై వెళ్తుంటే.. ఆ కిక్కే వేరప్పా! అంటారు ఇంకెందరో. ఇక లాంగ్ రైడ్స్‌కు రయ్‌మని దూసుకెళ్తే.. గాల్లో తేలినట్లే ఉంటుంది. అయితే.. ధర దగ్గరికి వచ్చే సరికి మాత్రం గుండెల్లో గుబులు పుడుతుంది. రూ.లక్షా 50వేలకు ఏమాత్రం తగ్గకుండా ఈ బ్రాండ్ బైక్స్ ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో కనీస మోడల్ బుల్లెట్ బైక్ ధర హైదరాబాద్‌లో రూ.లక్షా 50 వేలు. అదే హైఎండ్ మోడల్ రేట్లు అయితే.. అంతకంతకు పెరుగుతూ పోతాయి. వేరే బైక్స్‌తో పోల్చితే ఫీచర్లు కూడా తక్కువే.

అయితే, సామాన్యులకు కూడా దగ్గరయ్యేలా కాస్త తక్కువ ధరకే థండర్ బర్డ్ 350 మోడల్ బైక్‌లను ప్రవేశపెట్టబోతోంది రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ. ఈ మోడల్ బైక్ ధర రూ.1.57 లక్షలు(ఢిల్లీ ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించారు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన బుల్లెట్ 350, క్లాసిక్ 350ఎస్ మోడల్ బైక్‌ల ధరలు వాటి మార్కెట్ ధర కంటే రూ.8 నుంచి 9 వేల తక్కువగా లభిస్తున్నాయి. వీటి మాదిరిగానే థండర్ బర్డ్ 350 కూడా దాదాపు అదే ధరకు వస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఈ బైక్‌లు వచ్చే నెల మార్కెట్‌లోకి రానున్నాయి.

ఇప్పటికే బుల్లెట్ 350, క్లాసిక్ 350ఎస్ బైక్‌లు మార్కెట్‌లోకి వచ్చి హల్‌చల్ చేస్తున్నాయి. క్లాసిక్ 350ఎస్ బైక్.. ప్రస్తుతం ఉన్నక్లాసిక్ 350 మాదిరి డ్యూయల్ ఛానల్ ఏబీస్ మాదిరిగా కాకుండా సింగిల్ ఛానల్ ఏబీఎస్‌ను సూచిస్తుంది. ప్యూర్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటోంది. అంతేకాకుండా 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది 5,250 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 19.8 బీహెచ్‌పీ, 4వేల ఆర్‌పీఎం వద్ద 28 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
First published: September 26, 2019, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading