రూ.2 కోట్ల కాస్ట్లీ కారు.. కొన్న 20 నిమిషాలకే తుక్కయింది..

రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన కొన్న కారు... 20 నిమిషాల్లోనే తుక్కయింది. కనీసం ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే.. మధ్యలోనే రోడ్డు ప్రమాదానికి గురయింది.

news18-telugu
Updated: June 26, 2020, 8:54 AM IST
రూ.2 కోట్ల కాస్ట్లీ కారు.. కొన్న 20 నిమిషాలకే తుక్కయింది..
ప్రమాదానికి గురైన కారు
  • Share this:
అతడు రూ.2 కోట్ల ఖరీదైన లగ్జరీ కారు కొన్నాడు. చేతిలో కారు 'కీ' పడిన వెంటనే అతడిన ఆనందానికి అవధుల్లేవు. ఎన్నాళ్లో వేచి ఉదయం అంటూ.. షోరూమ్‌ నుంచి రయ్‌ రయ్‌మని రోడ్డు మీదకు దూసుకెళ్లాడు. తన కలల కారులో ప్రయాణిస్తూ చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టాడు. కానీ చిన్న సాంకేతిక సమస్య రావడంతో రోడ్డుపై ఆపాడు. కారు నుంచి ఇలా దిగాడో లేదో.. వెనకాల నుంచి మరో కారు దూసుకొచ్చి తన కారును ఢీకొట్టింది. రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన కొన్న కారు... 20 నిమిషాల్లోనే తుక్కయింది. కనీసం ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే.. మధ్యలోనే రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రపంచంలోనే తనకంటే దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరని తిట్టుకుంటూ.. లోలోప బాధపడుతూ పోలీసులకు సమాచారం అందించాడు దాని యజమాని. బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తనకెంతో ఇష్టమైన రూ.2 కోట్లు విలువైన లంబోర్గిని హరికేన్‌ స్పైడర్‌ మోడల్ కారును కొనుగోలు చేశాడు. షోరూమ్‌ నుంచి కారు డెలివరీ తీసుకొని ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కారులో సాంకేతిక లోపం తలెత్తింది. కొత్త కారు.. అప్పుడే ఏమైందబబ్బా అని.. అతడు కిందకు దిగాడు. ఏ జరిగిందో చెక్ చేసే లోపే.. వెనకాల నుంచి ఓ కారు దూసుకొచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనక భాగం దెబ్బతింది. కారును కొన్న 20వ నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరగడంతో.. దాని యజమాని ఎంతో బాదపడ్డాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు చేరుకొని అతడికి హెల్ప్ చేశారు.


ఆ ఫొటోను WYP రోడ్స్ పోలిసింగ్ యూనిట్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దానిపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. అయ్యో పాపం.. ;నీ కష్టం ఎవ్వరికీ రాకూడదు'. 'ఈ ప్రపంచంలోనే నీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరు'. అని కామెంట్స్ పెడుతున్నారు.

First published: June 26, 2020, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading