హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Independent House in Hyderabad: కేవలం 25 లక్షలకే ఇల్లు మీ సొంతం...ఎక్కడంటే..

Independent House in Hyderabad: కేవలం 25 లక్షలకే ఇల్లు మీ సొంతం...ఎక్కడంటే..

 హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కేవలం 30 నిమిషాల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల్ ప్రాంతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం హాట్ స్పాట్ గా నిలిచింది. ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌కు చేరుకునే సౌకర్యంతో పాటు, అత్యంత చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కేవలం 30 నిమిషాల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల్ ప్రాంతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం హాట్ స్పాట్ గా నిలిచింది. ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌కు చేరుకునే సౌకర్యంతో పాటు, అత్యంత చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కేవలం 30 నిమిషాల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల్ ప్రాంతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం హాట్ స్పాట్ గా నిలిచింది. ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌కు చేరుకునే సౌకర్యంతో పాటు, అత్యంత చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

ఇంకా చదవండి ...

హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనుగొనడం చేయడం ప్రతీ ఒక్కరి కల, ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే అది కోట్ల పైమాటే, దీంతో నగర శివారు ప్రాంతాల వైపే అందరి దృష్టి పడింది. ఓఆర్ఆర్ పుణ్యమా శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఎక్కడికక్కడ డెవలప్ మెంట్ క్లస్టర్లుగా మారాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డు నుంచి కేవలం 30 నిమిషాల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల్ ప్రాంతం రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం హాట్ స్పాట్ గా నిలిచింది. ఇక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో ఓఆర్‌ఆర్‌కు చేరుకునే సౌకర్యంతో పాటు, అత్యంత చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అలాగే ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో కలవడంతో పాటు సమీపంలోనే ఫార్మా సిటీ కూడా కడ్తాల్‌ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతున్నాయి. దశాబ్దాల క్రితమే ఈ ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన వెంచర్లు భారీ సంఖ్యలో ఈ ప్రాంతంలో వెలిశాయి. కొనుగోలుదారుల స్థాయికి తగ్గట్టుగా ధరలు ఉండటంతో అటు మధ్యతరగతి ప్రజల కలల ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రాంతం అనుగుణంగా ఉంది. హైదరాబాద్‌ నగరం శ్రీశైలం హైవే దిక్కుగా భారీగా విస్తరిస్తుండటంతో నగరానికి అత్యంత దగ్గరగా పట్టణ వసతులున్న కడ్తాల్‌ ప్రాంతం భవిష్యత్తు ఉంటుందని సామాన్య, మధ్యతరగతివాసులు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నారు.

కడ్తాల్ ప్రాంతం విశేషాలివే..

ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేలా మహా పిరమిడ్‌ నిర్మాణంతో పాటు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మైసిగండి మైసమ్మ ఆలయం సందర్శించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అన్నింటికీ మించి హైదరాబాద్ నగరానికి అత్యంత దగ్గర కావడంతో పాటు ఈ ప్రాంతానికి చేరువలోనే ఐటీ, మల్టీ నేషనల్ కంపెనీలు వెలియడం కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ ప్రాంతంలో పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు, పాఠశాలలు ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మహాపిరమిడ్‌ను ను సందర్శించడానికి. విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, గుడివాడ, బాపట్ల, కర్నూల్‌, కడప, చిత్తూరు, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి ధ్యానకేంద్రానికి వస్తుంటారు. ఈ ప్రాంతం నిత్యం కళకళలాడుతుంది. ఇక ఈ ప్రాంతంలోనే మక్తమాదారం, టాకురాజుగూడ, రేఖ్యాతండా, మైసిగండి, కర్కల్‌పహాడ్‌, ఎక్వాయిపల్లి, న్యామతాపూర్‌, చల్లంపల్లి, సాలార్‌పూర్‌, అన్మాసుపల్లి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

భూముల ధరలివే...

20నుంచి 100ఎకరాల విస్తీర్ణంలో విస్తరించాయి. చదరపు గజం రూ.2వేల నుంచి రూ.12వేల వరకు చెబుతున్నారు. రహదారి పక్కన ఉన్న వెంచర్లలో అధిక ధరలు ఉన్నాయి. లోపలికి వెళ్లేకొద్దీ తక్కువకే విక్రయిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నేపథ్యంలో కడ్తాల్‌ మండలం ఎక్వాయిపల్లి, కర్కల్‌పహడ్‌, వాసుదేవ్‌పూర్‌, బాలాజీనగర్‌, చల్లంపల్లి, సాలార్‌పూర్‌లలో భారీగా ధరలు బాగాపెరిగాయి. ఇప్పటికీ శ్రీశైలం రహదారి పక్కన ఉన్న భూములు ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.కోటిపైనే చెబుతున్నారు. కడ్తాల్‌ నుంచి షాద్‌నగర్‌ మార్గంలో లోపలికి పది కి.మీ దూరం వెళ్లేకొద్దీ ఎకరా రూ.15 లక్షలకు దొరుకుతోంది.

రూ.25 లక్షలకే ఇండిపెండెంట్ ఇల్లు...

కడ్తాల్ సమీపంలో ఇండిపెండెంట్ ఇళ్ల ధరల విషయానికి వస్తే...2 BHK, 3 BHK గృహాలు రెడీ టూ ఆక్యూపై తరహాలో నిర్మిస్తున్నారు. చాలావరకూ గేటెడ్ కమ్యూనిటీ తరహాలోనే ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మిస్తున్నారు. కనిష్టంగా 25 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. 150 గజాల్లో డబుల్ బెడ్రూం ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటి ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. ఇక సిటీతో కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ప్రాంతం నుంచి సిటీ ఆర్టీసీ బస్సులు కనెక్ట్ అయి వున్నాయి. సికింద్రాబాద్, కోటీ, మెహదీపట్నం ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలు చేసే వారికి కడ్తాల్ ప్రాంతం బెస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశం ఉంది.

First published:

Tags: Real estate, Real estate in Hyderabad

ఉత్తమ కథలు