కొత్త నాణేలు వచ్చేస్తున్నాయ్... 16న నమూనాల ఖరారు

కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో మార్కెట్‌లోకి కొత్త నాణేలు విడుదల చేయబోతోంది. ఇందుకోసం ఈ నెల 16న కీలక సమావేశం జరగబోతోంది. ఆ మీటింగ్‌లో నాణేల రూపురేఖలపై నిర్ణయం తీసుకోబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 6:09 AM IST
కొత్త నాణేలు వచ్చేస్తున్నాయ్... 16న నమూనాల ఖరారు
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 6:09 AM IST
రూ. 1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 కొత్త నాణేలు తేబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ఈ నెల 16న ఢిల్లీ జన్‌పథ్‌లోని జవహర్ వ్యాపార్ భవన్‌లో కీలక సమావేశం జ‌రుగ‌నుంది. కొత్త సీరిస్ నాణేల నమూనాల్ని ఈ సమావేశంలో ప్రదర్శిస్తారు. నాణేల్లో ఏమైనా మార్పులూ చేర్పులూ ఉంటే అధికారులు అభిప్రాయాలు చెప్పవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇటీవల బీజేపీ దివంగత నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ గుర్తుగా వెయ్యి రూపాయల నాణేన్ని విడుదల చేసిన కేంద్రం... ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నాణేలను చెలామణీలో ఉంచుతూనే, కొత్త నాణేలను కూడా తేబోతున్నారు. ఐతే... అవి ఎలా ఉంటాయి? వాటి తయారీకి వాడుతున్న మూల పదార్థాలేంటి? వంటి వివరాలేవీ కేంద్రం ఇంకా బయటపెట్టలేదు. 16న మీటింగ్ తర్వాత పూర్తి స్థాయి ప్రకటన వస్తుందని తెలిసింది.

ప్రస్తుతం వాడుతున్న స్టీల్ నాణేల్లో చాలా వాటిని బంగ్లాదేశ్‌లో అక్రమార్కులు కరిగించేస్తున్నారు. వాటితో బ్లేడ్లు తయారుచేస్తున్నారు. ఒక రూపాయి కాయిన్‌తో మూడు బ్లేడ్లు తయారవుతున్నాయి. అందువల్ల కాయిన్ల కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే కేంద్రం కొత్త నాణేలను తెస్తున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి:ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఏమవుతుంది? మెక్సికో గోడకూ, ఎమర్జెన్సీకి సంబంధమేంటి?


అంతరిక్షంలో అక్కడ ఏలియన్స్ ఉన్నారా? భూమివైపు వస్తున్న ఆ తరంగాలపై నాసా ఏం చెబుతోంది?
సహజసిద్ధంగా జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన 7 చిట్కాలు


రోజూ ఎంత పసుపు వాడితే ఆరోగ్యం?

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...