హోమ్ /వార్తలు /trending /

Viral News: ఏం బామ్మర్దులు సామి మీరు..బావను చివరకు అలా మార్చేస్తారా..?

Viral News: ఏం బామ్మర్దులు సామి మీరు..బావను చివరకు అలా మార్చేస్తారా..?

Peddapalli:బావల్ని పండుగ రోజున గౌరవించుకునేందుకు కొత్త సంప్రదాయం వచ్చింది, పెద్దపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు సోదరులు బావ,బామ్మర్దుల కట్నాలు పేరుతో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. పండుగ రోజున విదేశాల నుంచి వచ్చిన తమ బావకు నూతన వస్త్రాలతో పాటు మద్యం బాటిళ్లు సంతోష పెట్టారు. ఈ ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వార్త వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  జనంలో వస్తున్న కొత్త ఆలోచనలు, వింత ఆచారాలు, వినూత్న సంప్రదాయాలు ప్రస్తుత కాలంలో నయా ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. తెలంగాణ (Telangana)రాష్ట్రం పెద్దపల్లి (Peddapalli)జిల్లాలో కూడా ఇదే తరహా సంప్రదాయం ఒకటి సృష్టంచారు కొందరు వ్యక్తులు. దానికి బావ బామ్మర్దుల కట్నాలు అనే పేరు కూడా పెట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేస్తే బాగుంటుందని చిన్న మెసేజ్‌ని పాస్ చేశారు. ఈ కొత్త సంప్రదాయానికి మూలాలు ఏమిటంటే ఆడపడుచులు, తోబుట్టువులకు కానుకలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అయితే మహిళలకేనా పురుషులకు ఇలాంటి సంప్రదాయం ఉంటే బాగుంటుందని పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీధర్ (Sridhar),మహేశ్‌(Mahesh), శ్రీకాంత్ (Srikanth)అనే ముగ్గురు సోదరులు బావ బామ్మర్ధుల కట్నాలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే బావను బావమరుదులు పండుగ రోజున బావలను ఇంటికి పిలిచి నుదుట తిలకం దిద్ది కొత్త బట్టలు ఇచ్చి గౌరవించడంతో పాటుగా మద్యం బాటిల్‌ని కానుకగా ఇచ్చి సంతోషం పెట్టడం ఈ సంప్రదాయం ముఖ్య ఉద్దేశం. పెద్దపల్లికి చెందిన ముగ్గురు బ్రదర్స్ ఉగాది రోజున అదే చేశారు. అమెరికా నుంచి వచ్చిన తమ బావ దాస మల్లికార్జున్‌ (Dasa Mallikarjun)దగ్గర ఆశీర్వాదం పొందేందుకు ఈ వింత ఆచారాన్ని నిర్వహించారు.

  ఇదెక్కడి వింత ఆచారం సామీ..

  చూడటానికి, చెప్పుకోవడానికి కాస్త వెటకారంగా ఉన్నప్పటికి ముగ్గురు సోదరులు మాత్రం తాము చేసిన కార్యక్రమానికి గొప్ప నిర్వచనం ఇస్తున్నారు. బావలకు ఏది ఇష్టమో తెలియదు. మందు పార్టీలు కలిసి చేసుకోవడానికి కోసం కాస్త మొహమాటం పడుతూ ఉంటారు. అలాంటి వాటిని ఇలాంటి సాంప్రదాయం పేరుతో తొలగించవచ్చని అంటున్నారు. ఈ తరహా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వార్త కాస్త వైరల్ అయింది.

  స్లోగా ఫాలో అయిపోతారులే..

  ఆడపడుచులు, తోబుట్టువులకు కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎలా కంటిన్యూ అవుతుందో ..దీన్ని కూడా అలాగే నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఫోన్లలో వీడియో కాల్స్‌తో సరిపెట్టుకునే బంధుత్వం మరింత దగ్గరై మనసులు కలిసుకొని పాత అనుభూతులను నెమరవేసుకోవచ్చనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు. ఇప్పటికే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా పంచదార, కొబ్బరి కుడుకలు అందించుకోవడం అనవాయితీగా వచ్చేసింది. వదినలకు గాజులు, కుంకుమ, పువ్వులు పెడితే ఆడపడుచులకు చీరలు పెట్టి గౌరవించుకోవడం కూడా సాంప్రాదాయంగా మారింది. పెద్దపల్లికి చెందిన ముగ్గురు సోదరులు చేసిన ఘనకార్యం చూస్తున్న నెటిజన్లు బావలను సంతోష పెట్టే ఈ సంప్రదాయం కూడా అందరూ కొనసాగించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరికొందరు మాత్రం అంటే బామ్మర్దులే మద్యం బాటిళ్లు ఇచ్చి బావలను తాగుబోతులుగా మార్చేస్తారా ఎంటీ అని సెటైర్లు వేస్తున్నారు.

  First published:

  ఉత్తమ కథలు