HOME »NEWS »TRENDING »new bride and grooms planted inspired by the green india challenge avr

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో మొక్కలు నాటిన నూతన వధూవరులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో  మొక్కలు నాటిన నూతన వధూవరులు
మా గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకుంటాం

ఈ మొక్కలు నాటిన జ్ఞాపకం మాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది...

  • Share this:
    గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హంగు ఆర్భాటాలు లేకుండా ముఖరం గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, MPTC గాడ్గే సుభాష్ ఆధ్వర్యంలో ముఖరం గ్రామానికి చెందిన అంకుష్; కాంబ్లే జిజాబాయ్ నూతన వధూవరులు కేవలం 20 మంది పెద్దల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ ముఖాలకు మాస్క్ లు ధరించి గ్రామంలోని శివాలయం లో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో  వివాహం చేసుకున్న మేము ఈ శివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటిన జ్ఞాపకం మాకు ఎప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు కరోనా వైరస్ వల్ల ఎక్కువమంది బంధువులను వివాహానికి ఆహ్వానించకుండా కేవలం 20 మంది గ్రామ పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మా గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తామని నూతన వధూవరులు తెలిపారు.
    Published by:Venu Gopal
    First published:May 19, 2020, 13:55 IST