హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బిల్‌క్లింటన్‌కు మరో మహిళతో ఎఫైర్?... సంచలనం రేపుతున్న కొత్త బుక్...

బిల్‌క్లింటన్‌కు మరో మహిళతో ఎఫైర్?... సంచలనం రేపుతున్న కొత్త బుక్...

బిల్‌క్లింటన్, మోనికా లెవిన్‌స్కీ (ఫైల్)

బిల్‌క్లింటన్, మోనికా లెవిన్‌స్కీ (ఫైల్)

Bill Clinton : మోనికా లెవిన్‌స్కీతో బిల్ క్లింటన్ జరిపిన ఎఫైర్ అల్రెడీ పెద్ద రచ్చే రేపింది. మరి ఈ కొత్త ఎఫైర్ ఏంటి? ఇందులో నిజం ఎంత?

పుస్తకాలు రాసేవాళ్లు... ఏదో ఒక వివాదాన్ని వాటిలో చేర్చుతారు. తద్వారా... ఆ పుస్తకానికి బాగా పబ్లిసిటీ పెరిగి... బాగా సేల్స్ అవుతుందనేది ఓ ఫార్ములా. ఇలా ఇప్పటివరకూ ఎన్నో పుస్తకాలు ఎన్నో వివాదాల్ని తెరపైకి తెచ్చాయి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను టార్గెట్ చేస్తూ ఓ బుక్ రిలీజ్ కాబోతోంది. బిల్‌క్లింటన్‌కు బ్రిటన్ మహిళ ఘిస్లైన్ మాక్స్‌వెల్‌తో ఎఫైర్ ఉన్నట్లు ఆ బుక్‌లో ఆరోపణలున్నాయి. ఇది ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీసింది. పుస్తకం పేరు "ఎ కన్వీనియంట్ డెత్ - ది మిస్టీరియస్ డెత్ జెఫ్రీ ఎప్‌స్టెయిన్". జూన్ 2న ఈ పుస్తకం రిలీజ్ కాబోతోంది. ఎప్‌స్టెయిన్‌కి ఫ్రెండ్స్ కావడం వల్ల బిల్ క్లింటన్, మాక్స్‌వెల్ క్లోజా కాగలిగారని ఆ పుస్తకం ఆరోపిస్తోంది.

మాక్స్‌వెల్ అంటే మోజుపడటం వల్లే బిల్ క్లింటన్... ఎప్‌స్టెయిన్‌తో ఫ్రెండ్షి్ప్ చేశారనీ... బిల్ క్లింటన్... మాక్స్‌వెల్ క్లోజ్ అవ్వడాన్ని తాను చూశానని ఓ వ్యక్తి చెప్పినట్లు ఆ పుస్తకంలో రాశారు.

ఈ తాజా ఆరోపణలను బిల్ క్లింటన్ ప్రతినిధి ఏంజెల్ ఉరెనా ఖండించారు. "ఇదంతా అబద్దం. ఇది అబద్ధమని రేపు తేలుతుంది. ఇది అబద్ధమని ఇప్పటి నుంచి ఏళ్ల తరబడి తేలుతుంది" అని ఆమె అన్నారు.

సెక్స్ కేసులో దోషిగా తేలిన ఎప్‌స్టెయిన్... మాక్స్‌వెల్‌తో డేటింగ్ చేశాడనీ... అతడే క్లింటన్‌కి ఆమెను పరిచయం చేశాడని ఆ పుస్తకం ఆరోపిస్తోంది. 2002లో మాన్‌హట్టన్ రెస్టారెంట్‌లో మాక్స్‌వెల్‌తో కలిసి... క్లింటన్ డిన్నర్ చేసినట్లు న్యూయార్క్ మేగజైన్ ఆర్టికల్ ఆరోపించింది. అప్పట్లో న్యూయార్క్‌లో వాళ్లిద్దరూ కలిసి కనిపించడం చర్చనీయాంశం అయ్యిందని ఆ ఆర్టికల్ చెబుతోంది.

క్లింటన్‌కి ఇదివరకు వైట్‌హౌస్‌లో ఉద్యోగిని, ఫ్యాషన్ డిజైనర్ అయిన మోనికా లెవిన్‌స్కీతో ఎఫైర్ ఉంది. ఆ విషయంపై దర్యాప్తు అధికారులకు క్లింటన్ అబద్దం చెప్పారు. నిజం నిగ్గు తేలడంతో 1998లో ఆయన్ని అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పట్లో అదో సెన్సేషన్.

ఓ సెక్స్  కేసులో దోషిగా తేలిన ఎప్‌స్టెయిన్‌ను 2019లో అరెస్టు చేశారు. గతేడాది ఆగస్టులో అతడు న్యూయార్క్ జైల్లో సూసైడ్ చేసుకున్నాడు.

First published:

Tags: America

ఉత్తమ కథలు