తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ను ఆక్రమించడంతోనే పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తాలిబన్లపై భయంతో అక్కడ్నించి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా తాలిబన్ల ఆకృత్యాలపై వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆప్ఘనిస్తాన్ ఉపయోగంలో తాలిబన్ల వ్యవహారంపై చర్చ సాగుతుంటే.. ప్రపంచ విఖ్యాత బిలియనీర్, స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్(Elon musk) మాత్రం తాలిబన్ల విషయంలో మరో అంశంపై స్పందించారు. అప్ఘన్ను సొంతం చేసుకున్నతర్వాత తాలిబాన్లు పలు మీటింగ్‌లు పెట్టారు. అందులో ఎవరూ ఎక్కువగా మాస్కులు పెట్టకోలేదు. అయితే ఈ తాలిబన్లు(talibans) మాస్క్ లేకుండా గదిలో ఓ చోట సమావేశమైన ఫోటోను సోషల్ మీడియా(social media)లో షేర్ చేశారు ఎలన్. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న డెల్టా(delta) వేరియంట్ గురించి తెలియదా .. దాని గురించి వినలేదా అని ఎలన్ మస్క్ తాలిబన్లను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు స్పందించారు.. నిజమేనా? మీరు తాలిబన్లను విమర్శించబోతున్నారా? దాని గురించి కాదు మాట్లాడటం. వారు చెడ్డ వ్యక్తులు.. అక్కడ మాస్కుకు అంత ప్రాధాన్యత లేదు? ఈ సమయంలో డెల్టాకు ప్రాధాన్యత లేదని నేను భావిస్తున్నా. మీరు ఓ సైంటిస్ట్ కొంచెం బెటర్‌గా ఆలోచించండి. ఇంతకీ మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా? అంటూ విమర్శలు గుప్పించారు.
— Elon Musk (@elonmusk) August 20, 2021
అపర కుబేరుల్లో ఒకరు..
ఎలన్ మస్క్ గతేడాది ధనవంతుల జాబితాలో 35 వ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ కేవలం ఏడాదిలో మొదటిస్థానానికి చేరాడు. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం మస్క్ ఆస్తి విలువ 188.5 బిలియన్ డాలర్లు. టెస్లా షేర్ల ధరలు పెరగడంతో మస్క్ ఆస్తి విలువ అమాంతం పెరిగింది. అందుకే ఆయనే ఇప్పుడు ప్రపంచంలోని ధనవంతులలో ఒకరు. ప్రస్తుతం ఆయన వయసు నలభై తొమ్మిదేళ్లు. ఆయన విజయ దాహం ఇప్పుడు కాదు పన్నేండేళ్ల వయసు నుంచే మొదలైంది. ఎలన్ 12 సంవత్సరాల వయస్సులో బ్లాస్టర్ అనే వీడియోగేమ్ తయారు చేశాడు. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని 500 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికా సైన్యంలో పని చేయడం ఇష్టం లేక కెనడా వెళ్లిపోయాడు. కొద్ది ఏళ్లలో స్పేస్ ఎక్స్ నెలకొల్పాడు. ప్రతి విజయానికి ముందు అతనికి వైఫల్యమే ఎదురొచ్చేది. ఆ ఓటమనే విజయానికి మొదటి మెట్టుగా మార్చుకుని నేడు ప్రపంచకుబేరుడిగా ఎదిగాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, Netizen, Taliban, Trolling, Viral tweet