కరోనా దెబ్బకు మార్చి రెండో వారం నుంచి స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి. ఏకంగా పదోతరగతి బోర్డు పరీక్షలే రద్దయ్యాయి. దాదాపు 5 నెలలుగా విద్యా సంస్థల గేట్లకు తాళాలు పడ్డాయి. పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ లేనంతా నెలల తరబడి సెలవులు రావడంతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు స్కూల్స్ గురించే మరిచిపోయారు. మరి ఐదు నెలల సెలవుల తర్వాత.. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయంటే పిల్లల పరిస్థితేంటో తల్లిదండ్రులందరికీ తెలుసు. కలలో కూడా అలా జరగొద్దని కోరుకుంటారు. ఇక్కడున్న బుడ్డోడు కూడా అలాంటోడే..! స్కూల్స్ తెరవద్దంటూ వెక్కి వెక్కి మరీ ఏడ్చాడు.
స్కూల్స్ ఓపెనింగ్ గురించి ఓ మహిళ తన కుమారుడితో వీడియో చేసింది. స్కూళ్లకు ఐదు నెలలు సెలవులు వచ్చాయి కదా. ఇక చాలు. స్కూల్స్ తెరుకోవాలని అల్లాను కోరుకోవాలని చెప్పింది. ఆగస్టు 15 నుంచే ప్రారంభం కావాలంటూ ప్రార్థించమని సూచించింది. తల్లి నోటి నుంచి ఆ మాట విన్న వెంటనే మనోడు ఏడుపు లంకించుకున్నాడు. 'వద్దు మమ్మీ.. వద్దు.. స్కూల్స్ ఇప్పుడే తెరవద్దు' అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ వీడియోను అరవింద్ మయరమ్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు బుడ్డోడిపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఎంత క్యూట్‌గా ఉన్నావ్ రా.. అంటూ మెచ్చుకుంటున్నారు. పిల్లల అమాయకత్వం భలే సరదాగా ఉంటుందని కదా అని నవ్వుకుంటున్నారు. బాల్యంలో మనం కూడా ఇలాగే చేసి ఉంటామని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:August 12, 2020, 15:51 IST