బ్రతుకు దెరువు కోసం ప్రతి ఒక్కరూ ఏదో పని చేసుకోవాల్సిందే. అయితే చేస్తున్న పని కూడా నలుగుర్ని మెప్పించేలా ..పది మందిలో గుర్తింపు తెచ్చుకునేలా పని చేయడం చాలా మందికి తెలియదు. అయితే ఓ హోటల్(Hotel)లో సర్వర్ కస్టమర్లకు టిఫిన్ సర్వ్ చేస్తున్న తీరు ఇప్పుడు నెటిజన్లకే కాదు ఫేమస్ బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్ర(Anand Mahindra)ను ఆకర్షించింది. ఆ వ్యాపారవేత్త ప్రశంసలు అందుకునేలా చేసింది. సోషల్ మీడియా(Social media)లో తెగ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్ర రీసెంట్‌గా ఓ హోటల్‌లో సర్వర్ 15టిఫిన్ ప్లేట్ల(Tiffin plates)ను ఒకే చేతిలో పట్టుకొని తీసుకెళ్లి కస్టమర్లకు అందజేయడం అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈవీడియో(Video)ని బిజినెస్ థైకూన్ ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్(Twitter)హ్యాండిల్‌లో పోస్ట్ చేసి తన అమూల్యమైన కామెంట్‌ని షేర్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియో ..
చాలా హోటళ్లలో సర్వర్లు, వెయిటర్లు కస్టమర్లకు టిఫిన్ ఆర్డర్ చేస్తే ఒక్కొక్కరికి విడి విడిగా తీసుకురావడం చూస్తుంటాం. కాని ఇప్పడు సోషల్ మీడియాలో మహీంద్ర గ్రూప్స్ చైర్మెన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో హోటల్‌లో పని చేస్తున్న వెయిటర్ ఒకేసారి 15దోసెల్ని కస్టమర్లకు అందజేయడానికి ఒకదానిపై మరొకటి పెట్టుకొని సింగిల్ హ్యాండ్‌తో సర్వ్ చేశాడు. అతని టాలెంట్‌ని పొగుడుతూ ఆనంద్ మహీంద్ర ఈ వెయిటర్ టాలెంట్‌ని ఒలింపిక్ క్రీడగా గుర్తించాలని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలాంటి పోటీలు ఒలింపిక్‌లో పెడితే ఖచ్చితంగా ఈ వెయిటర్‌కి గోల్డ్ మెడల్ రావడం ఖాయమంటూ ట్వీట్ చేశారు. సర్వర్ టిఫెన్ ప్లేట్స్ మోసుకెళ్తున్న వీడియోని షేర్ చేసారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిజినెస్‌మెన్‌కు ప్రశ్నలు ..
ఆనంద్ మహీంద్ర అంతటి పెద్ద వ్యాపారవేత్త గొప్పగా వర్ణిస్తూ..ఓ హోటల్ వెయిటర్ వీడియోని పోస్ట్ చేసి ప్రశంసిస్తే..నెటిజన్లు మాత్రం అందులో ఓ పొరపాటును గమనించారు. ఒక ప్లైటుపై మరొక ప్లేటు తీసుకెళ్లడం వల్ల పైన ఉన్న ప్లేటు కింద భాగం..కింద ప్లేట్‌లోని దోసెకు అంటుకుంటోందని ..ఇంత అశుభ్రంగా ఉండే దగ్గర టిఫిన్ చేయడం మంచిది కాదంటూ ..ఈ పొరపాటును మీరు గమనించారా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ఇది సరైన పద్దతి కాదు..
మరికొందరు అయితే ఒక్కొక్క కస్టమర్‌కి వెంటనే ఇస్తే టిఫిన్ వేడిగా ఉంటుందని ..ఇలా 15 దోసెలు ఒకేసారి తీసుకెళ్లేలోపు చివరి కస్టమర్ దగ్గరు వెళ్లేలోపు దోసె చల్లబడిపోతుందంటూ తమకు తట్టిన ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anand mahindra, VIRAL NEWS, Viral Video