హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Tomato: టమోటా ధరలు పెరగడంతో మారిన నెటిజన్లు ఆలోచన.. ఏం సెర్చ్ చేస్తున్నారో తెలిస్తే..

Tomato: టమోటా ధరలు పెరగడంతో మారిన నెటిజన్లు ఆలోచన.. ఏం సెర్చ్ చేస్తున్నారో తెలిస్తే..

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన వార్ కారణంగా అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పైకి కదిలాయి.చిన్న వస్తువుల నుంచి వంట గ్యాస్ 

వరకూ అన్నిటి పై ప్రభుత్వం ధరలను భారీగా పెంచింది.నిత్యావసర ధరలు అయితే మండి పోతున్నాయి..ఎండలు పెరిగే కొద్ది కూరగాయల 

ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏక టమాటా.. పెట్రోల్ తో పోటీ పడే పరిస్థితి నెలకొంది.

రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన వార్ కారణంగా అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పైకి కదిలాయి.చిన్న వస్తువుల నుంచి వంట గ్యాస్ వరకూ అన్నిటి పై ప్రభుత్వం ధరలను భారీగా పెంచింది.నిత్యావసర ధరలు అయితే మండి పోతున్నాయి..ఎండలు పెరిగే కొద్ది కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏక టమాటా.. పెట్రోల్ తో పోటీ పడే పరిస్థితి నెలకొంది.

Tomato: కొద్దిరోజులుగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వరదల కారణంగా టమోట పంట బాగా దెబ్బతింది. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

  ఇప్పుడు టమోటాలు కూరగాయల మార్కెట్లో కంటే ఎక్కువగా వార్తల్లోనే కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొద్దిరోజుల క్రితం వరకు రూ. 10 లేదా రూ. 20కు దొరికిన కిలో టమోటాలు.. ఇప్పుడు రూ. 100 నోటు ఇస్తే కానీ దొరకడం లేదు. దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. నవంబర్ నెలలో దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో నిరంతర భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సాధారణ జీవితానికి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టమోటాల దిగుమతులు నిలిచిపోవడంతో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. చెన్నై ప్రధాన కేంద్రమైన కోయంబేడు మార్కెట్‌లో కూడా ప్రస్తుతం కిలో రూ.150కి పైగా విక్రయిస్తున్నారు. దీంతో ఈ ధరలను చూసి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  గతంలో తమిళనాడులోని ధర్మపురి జిల్లా రైతులు తమ ఉత్పత్తులకు కిలో రూ. 4 ఉండగా కేవలం రూ. 1 మాత్రమే లభిస్తోందని ఆరోపిస్తూ దాదాపు టన్ను టమోటాలను రోడ్డుపై పడేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే టమోటా ధరలు పెరగడంతో గూగుల్‌లో ఎక్కువమంది టమోటాల గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే వీరిలో టమోటా ధరల గురించి శోధించే వారితో పాటు టొమాటో లేకుండా చట్నీ, సాంబార్, రసాన్ని ఎలా తయారు చేయాలనే దానిపై సెర్చ్ చేసే వాళ్లు కూడా ఎక్కువగా ఉండటం మరో విశేషం. సాధారణంగా కూరగాయాలు లేక ఇతర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఇలాంటి వాటి గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం సర్వసాధారణం. అయితే టమోటా ధరలు ఎప్పటికి దిగొస్తాయో అని భావిస్తున్న చాలామంది.. టమోటా లేకుండా చేసే వంటకాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

  దక్షిణాది రాష్ట్రాల్లో టమోటా సహా కూరగాయల ధరలు పెరుగుతుంటే.. ఢిల్లీ కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలుస్తోంది వర్షాల కారణంగా దక్షిణ భారతదేశం నుండి ఢిల్లీకి టమోటా సరఫరా దెబ్బతిందని... రానున్న రోజుల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలో ధరలు ప్రస్తుత స్థాయి కంటే పెరిగే అవకాశం ఉందని . ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. ఇక దేశంలో అత్యధికంగా టమోటా పంట ఆంధ్రప్రదేశ్‌ నుంచే వస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లి అత్యంత పెద్ద టమోటా మార్కెట్ అయింది.

  కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

  Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

  కొద్దిరోజులుగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వరదల కారణంగా టమోట పంట బాగా దెబ్బతింది. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటం కూడా టమోటా ధరలు పెరగడానికి మరో కారణం. ఈ సీజన్‌లో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా సరఫరా లేదు. ఇది కూడా టమోటా ధరలు పెరగడానికి ఇంకో కారణం. వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పంట దిగుబడి పెరిగితేనే.. టమోటా ధరలు దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Tomato Price

  ఉత్తమ కథలు