CM dance video: డ్యాన్సులతో అదరగొట్టిన ముఖ్యమంత్రి.. ఫిదా అయిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్​

డ్యాన్స్​ చేస్తున్న సీఎం, పాట పాడుతున్న శంకర్​ (Photo: ANI/Twitter)

ఓ ముఖ్యమంత్రే (chief minister) డ్యాన్సు చేసే అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకేముందు.. మన నెటిజన్లు (netizens) ఊరుకుంటారా? అలా వైరల్ చేసి పడేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న ముఖ్యమంత్రి మరీ యంగ్​ సీఎం ఏం కాదు.. అయినా కూడా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకీ ఎవరా సీఎం.

  • Share this:
    విభిన్నంగా కనిపించే కొన్నికొన్ని వీడియోలు సోషల్​మీడియా (social media)లో వైరల్​గా మారుతుంటాయి. హాస్యాస్పదంగా ఉన్నవి.. మనుసుకు హత్తుకునేవి.. చిన్న పిల్లల వీడియోలు.. ఇంకా పెళ్లళ్లలో డ్యాన్సులు... విభిన్న డ్యాన్సుల వీడియోలు.. కాదేది వైరల్​ (viral)కు అనర్హం. ఇటీవలె తెలంగాణలో ఓ వధువు బుల్లెట్​ బండి పాటకు డ్యాన్సు వేసి నెటిజన్లను ఆకట్టుకుంది. సాదాసీదా మనుషులు వేస్తే వైరల్ చేయడానికి సోషల్​మీడియా జనాలు ముందుంటారు. అయితే ఇక్కడ ఓ ముఖ్యమంత్రే (chief minister) డ్యాన్సు చేసే అందరినీ ఆకట్టుకున్నారు. ఇంకేముందు.. మన నెటిజన్లు (netizens) ఊరుకుంటారా? అలా వైరల్ చేసి పడేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న ముఖ్యమంత్రి మరీ యంగ్​ సీఎం ఏం కాదు.. అయినా కూడా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకీ ఎవరా సీఎం.. ఎక్కడ.. తెలుసుకుందాం.. పదండి

    శంకర్​ మహదేవన్​ పాటకు..

    ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) సీఎం భూపేష్ బాఘెల్(Bhupesh Baghel) తన డాన్స్‌ (dance)తో అలరించారు. ఛాంద్‌ఖురైలోని మాతా కౌసల్య దేవి దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి బాఘెల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ (shanker Mahadevan)​ పాడిన పాటకు భూపేశ్  (Bhupesh Baghel) డ్యాన్స్ (dance) చేశారు. పార్టీ నేతలు కూడా బాఘెల్తో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే ఛత్తీస్‌గఢ్‎లో సీఎం (CM) మార్పుపై పలు వార్తలు వస్తున్నాయి.



    గతంలో కిరణ్​ రిజుజు..

    కొద్ది రోజుల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (kiran rijuju) సింగర్‎గా అవతారమేత్తి పాట పాడారు. అరుణాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ (Civil services) యువ అధికారులకు ఏడాది శిక్షణ ముగిసింది. వారికి ఇటీవల ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు రిజిజు. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రిజిజు.. తన పాటకు సంబంధించిన ఈ వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు.

    మాజీ కేంద్రం మంత్రి..

    ఇటీవలె మాజీ కేంద్రమంత్రి సీనియర్ టీడీపీ నాయకులు అశోక్ గజపతి రాజు (Ashoka gajapati raju) తన రిసార్ట్‌లో చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయింది. అశోక్ గజపతి రాజు ఎనర్జిటిక్ గా చేసిన డ్యాన్స్ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అశోక్ గజపతి రాజు వీడియోలో తన కుంటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా స్టెప్పులు వేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published: