ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేని తన జీవితంలో అడుగుపెడుతున్నట్టుగా తెలిపారు. అలాగే నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో చాలా మంది నెటిజన్లు, ఆమె అభిమానులు.. కంగ్రాట్స్ చెబుతున్నారు. సునీత చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని.. భవిష్యత్తులో ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. "కంగ్రాట్స్ సునీత గారు. మీ మిగిలిన జీవితాన్ని హ్యాపీగా గడపండి.. ఆల్ ది బెస్ట్" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
"మంచిచెడులు, ఎత్తుపల్లాలు అనేవే జీవితం అలాంటివి ఎన్నో భరిస్తూ, ఎదిరిస్తూ దాటుకుంటూ వచ్చారు ఇప్పటినుండి మీ లైఫ్ హ్యాపీగా సాగాలని కోరుకుంటూ హ్యాపీ లైఫ్ జర్నీ సునిత గారు" అని మరో నెటిజన్ ఫేస్బుక్లో కామెంట్ చేశాడు. అయితే ఒకరిద్దరు అకతాయిలు మాత్రం సునీతను విమర్శించే విధంగా కామెంట్ పెట్టారు.
View this post on Instagram
ఇక, రెండో పెళ్లి గురించి ప్రకటించిన సునీత.. "ప్రతి తల్లిలాగే నా పిల్లల కూడా భవిష్యత్తు బాగుండాలని, మంచిగా స్థిరపడేలా చూసేందుకు కలలు కంటున్నాను. అలాగే నా పిల్లలు నేను నా జీవితంలో స్ధిరపడాలని కోరుకునే.. అద్భుతమైన పిల్లలు, తల్లిదండ్రులు ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. చివరికి ఆ క్షణం వచ్చింది.. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్ పాట్నర్గా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరంలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాము. నా జీవిత విషయాలను ప్రైవేట్‌గా ఉంచుతాను.. ఆ విషయం అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఎప్పటిలాగే నన్ను ఆదరించి, మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నాను'' అని సునీత పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.