పార్కులో వింత మంట... వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు...

Park Fire : ఆ పార్కులో మంట... ఎండిన గడ్డిని మాత్రమే తగలబెడుతోంది. వేరే దేనినీ ముట్టుకోవట్లేదు. ఎందుకలా?

news18-telugu
Updated: May 10, 2020, 1:40 PM IST
పార్కులో వింత మంట... వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు...
పార్కులో వింత మంట... వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు... (credit - FB - Club De Montaña Calahorra)
  • Share this:
Park Fire : కొన్ని కొన్ని వీడియోలు చూసినప్పుడు మనం షాక్ అవుతాం. "అరే భలే ఉందే" "ఇదెలా సాధ్యం" అని అనుకుంటాం. ఈ వీడియో చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. సహజంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, కార్చిచ్చు రేగినప్పుడు... మంటలు... ఇష్టమొచ్చినట్లు ఎగసిపడతాయి. వాటికి అడ్డొచ్చిన అన్నింటినీ తగలబెట్టేస్తాయి. స్పెయిన్‌లోని కలహొర్రాలోని పార్కులో మాత్రం... మంట అలా చెయ్యలేదు. ఓ పద్ధతిలో వెళ్తూ... ఎండిన గడ్డి మొక్కల్ని మాత్రమే తగలబెడుతూ ముందుకుసాగింది. మధ్యలో కొన్ని చెక్క బెంచీలు, చెట్లూ ఉన్నా మంట వాటి జోలికి వెళ్లలేదు. ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు ప్రశ్నించుకున్నారు.

సముద్రంలో అల వచ్చినట్లుగా మంట అలా వచ్చి... అలా వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బుధవారం ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చెయ్యగా... ఇప్పటికే దీన్ని 36వేల మందికి పైగా చూశారు. 300కు పైగా షేర్స్ వచ్చాయి. ఇది ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎక్కువగా షేర్ అవుతోంది.


నిజానికి ఈ వీడియోని మొదట రెడ్డిట్‌లో ది రోసారీ ఐజిల్స్ అనే యూజర్ అప్‌లోడ్ చేశారు. ఇప్పుడు ఇది రెడ్డిటర్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. మంటకు వెనక వైపు నుంచి బలమైన గాలి వీస్తుండటం వల్ల... మంట వేగంగా ముందుకు వెళ్లిందనీ... అందువల్లే అది... చెట్లు, బెంచీల జోలికి వెళ్లలేకపోయిందని కొందరు అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 10, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading