సింహాన్ని చంపి... కపుల్స్ సరసాలు... తిట్టిపోస్తున్న నెటిజన్లు...

అసలే ఈ ప్రపంచంలో జంతువుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇక సింహాలైతే ఎప్పుడో అంతరించిపోతున్న జీవుల లిస్టులో చేరిపోయాయి. అలాంటి ఈ రోజుల్లో ఆ ట్రోఫీ హంటర్స్ చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 19, 2019, 8:32 AM IST
సింహాన్ని చంపి... కపుల్స్ సరసాలు... తిట్టిపోస్తున్న నెటిజన్లు...
సింహాన్ని చంపిన జంట (Image : Twitter / 23 WIFR)
  • Share this:
ముద్దుల్లో మునిగితేలుతున్న ఈ కెనడా జంట... ఇటీవలే సౌత్ ఆఫ్రికాకు హంటింగ్ ట్రిప్ కోసం వెళ్లింది. అక్కడ ఈ పెద్ద సింహాన్ని చంపేసింది. ఏదో ఘనకార్యం సాధించినట్లు... ఆ సింహం పక్కనే ముద్దులు పెట్టుకుంటూ... ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను లెగెలెలా సాఫారిస్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు డార్రెన్, కారొలిన్ కార్టెర్. ఈ ఫొటోపై దుమారం రేగడంతో... లెగెలెలా సఫారీస్... తమ ఫేస్‌బుక్ పేజీని డిజేబుల్ చేసింది. అందువల్ల ఇక ఈ ఫొటో ఎవరికీ కనిపించదు అనుకుంది. ఈ జంట కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీనీ, తమ వెబ్‌సైట్‌నీ డిజేబుల్ చేసింది. తద్వారా తమపై వస్తున్న విమర్శల నుంచీ తప్పించుకోవచ్చని అనుకుంది. కానీ అప్పటికే బ్రిటన్‌కి చెందిన డైలీ మిర్రర్... ఈ ఫొటోను కాపీ చేసుకుంది. దీనిపై ఓ కథనం రాసి... కపుల్స్‌ని తిట్టిపోసింది. ఇదో భయంకరమైన దృశ్యం అనీ, ఆ జంటకు రోగం పట్టుకుందనీ... ఇప్పటికైనా ట్రోఫీ హంటింగ్ ప్రాక్టీస్‌కి ముగింపు పలకాలని కోరింది. హంటింగ్ ట్రోఫీల దిగుమతిపై బ్రిటన్ న్యాయమూర్తురలు... బ్యాన్ విధించాలని కోరింది.


జంతు రక్షణ సంస్థ పెటా సైతం ఈ జంటపై మండిపడింది. ట్రోఫీ హంటింగ్‌ని వ్యతిరేకిస్తూ... అమెరికా పోస్టల్ సర్వీస్ విభాగం... హంటింగ్ ట్రోఫీలను దిగుమతి చేసుకోవడం మానేయాలని కోరింది.ట్రోఫీ హంటింగ్ అనేది ప్రస్తుతం 63 దేశాల్లో కొనసాగుతోంది. వాటిలో మూడొంతుల దేశాలు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ఈ ట్రోఫీలను దిగుమతి చేయించుకునే అమెరికా హంటర్లు... జింబాబ్వే లాంటి దేశాలకు వెళ్లి జంతువుల్ని వేటాడతారు. ఇందుకోసం లక్షల రూపాయలు చెల్లిస్తారు. ప్రపంచంలోని ట్రోఫీ హంటర్లలో 80 శాతం అమెరికన్లే. ఒక్క 2017లోనే 6లక్షల 50 వేల ట్రోఫీలను అమెరికన్లు దిగుమతి చేసుకున్నారు.ట్రోఫీలు కొనడం ద్వారా, తమ వేట ద్వారా... పేద దేశాలకు చాలా డబ్బులు వచ్చేలా చేస్తున్నామనీ, ఆ దేశాలను కరవు, ఆకలి చావుల నుంచీ ఆదుకుంటున్నామని ట్రోఫీ హంటర్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ... ఇలా జంతువుల్ని దారుణంగా చంపేస్తూ, వాటి ముందు ఫొటోలు దిగుతూ... అనాగరికంగా వ్యవహరిస్తూ... వన్యప్రాణులు అంతరించిపోయేలా చెయ్యడం గొప్ప పని ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు వన్యప్రాణుల సంరక్షకులు. అలాంటి వారంతా... ఇప్పుడీ జంటపై తీవ్రంగా మండిపడుతున్నారు.
First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>