తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఆయన తన భావాలను ట్విటర్ (Twitter)లో ఎక్కువగా వ్యక్తపరుస్తాడనే విషయం తెలిసిందే. దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలు తదితరాలపై ట్విటర్‌నే ఆయన ఎక్కువగా వేదికగా చేసుకుంటారు. ఇటీవలె దావోస్‌కు వెళ్లారు మంత్రి కేటీఆర్. యూకే, దావోస్ (Davos)లో పది రోజులపాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ పర్యటనకు (Davos tour) సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు కేటీఆర్. చక్కని వాతావరణంలో జ్యూరిచ్‌లో వీధి పక్కన కూర్చొని భోజనం.. కుడోస్ దావోస్.. టిల్ నెక్ట్స్ టైం (మళ్లీ వచ్చే వరకు గుడ్‌బై దావోస్)’ అంటూ ఫొటోలతో మంత్రి కేటీఆర్ ట్వీట్ (KTR Tweets) చేశారు. ఆ ఫొటో మాత్రం అలా హీరోలా పోజిస్తూ దిగడంతో నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిసింది.
Lunch on a street side seating at Zurich in picture perfect weather ☀️
Adios Davos; till next time 🤞 pic.twitter.com/oyds9K6bZR
— KTR (@KTRTRS) May 27, 2022
ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు (Netizens) పలు రకాలుగా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ హీరోని కోల్పోయింది..! అని ఒకరంటే.. మరొక నెటిజన్ తెలుగు పరిశ్రమ కాదేమో పూర్తి భారతీయ సినీ పరిశ్రమేమో అని నా డౌటానుమానమండయ్యా... ఎందుకంటే ఆ మీసకట్టు లేని ముఖారవిందం నాకైతే బాలీవుడ్ హీరోలనే జ్ఞప్తికి తెస్తోంది మరి.. అని రిప్లై ఇచ్చాడు.
తెలుగు పరిశ్రమ కాదేమో పూర్తి భారతీయ సినీ పరిశ్రమేమో అని నా డౌటానుమానమండయ్యా...🤔
ఎందుకంటే ఆ మీసకట్టు లేని ముఖారవిందం నాకైతే బాలీవుడ్ హీరోలనే జ్ఞప్తికి తెస్తోంది మరి....🤗
— మోహనకృష్ణ. (@B_M_KRISHNA) May 28, 2022
అయితే జ్యూరిచ్ ఫొటోపై మెల్బోర్న్లో ఉన్న ఓ తెలుగు నెటిజన్ మండిపడుతూ ఓ కామెంట్ పెట్టాడు. ‘‘అయ్యా, ఇక్కడ మీ CS ఏదొ Order పాస్ చేశాడట. పాపం ఉదయం నుంచి ఎర్రటి ఎండలో మా అమ్మ Orders పట్టుకొని Peddapalli - Karimnagar - jagityal తిరిగింది . చివరలకి ఓక్కటె మాట అన్నది, ఏం పాపం చేశా అని ఇలా అవుతుంది అని. మీరు మాత్రం స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మీ తండ్రి గారేమో బెంగళూరులో ఉన్నాడు. దేవుళ్ల అయ్యా మీరు’’ అంటూ తన గోడును ట్విటర్ వేదికగా ఎలుగెత్తాడు.
అయ్యా, ఇక్కడ మీ CS ఏదొ Order పాస్ ఛెసాడట.
పాపం పొద్దటి సంది ఎర్రటి ఎండలో మా అమ్మ Peddapalli - Karimnagar - jagityal తిరిగింది Orders పట్టుకొని.
చివరలకి ఓక్కటె మాట అన్నది, ఏం పాపం చేస అని ఇలా అయుతుంది అని.
And U r chilling out in Swiss n u r father in Blore.Devullu ayya meru🙏🏻🙏🏻
— Dev🇮🇳🇮🇳 (@DevSayz) May 27, 2022
ఈ కామెంట్‌కు పలువురు నెటిజన్లు కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు మెల్బోర్న్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. నీకో దండం రా సామీ, అతను తెలంగాణాలో పెట్టుబడి కోసం దావోస్ వెళ్ళాడు, తద్వారా చాలా మందికి ఉద్యోగం వస్తుంది” అని తెలిపాడు.
కాగా, ఆ ట్వీట్లో నెటిజన్ మండిపడటానికి కారణం.. టీచర్ల బదిలీలపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆర్డర్. పరస్పర అంగీకారం నేపథ్యంలో బదిలీలు చేసుకోవచ్చని ప్రభుత్వ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో కొన్ని పరిమితులు విధించింది. దీంతో ఈ నిబంధనలు టీచర్లకు ఇబ్బందిగా మారాయి. దీనిపైనే కేటీఆర్ను ఆ నెటిజన ప్రశ్నించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.