NETFLIX LAUNCHES NEW WEBSITE FOR MOST VIEWED CONTENT WEEKLY TOP 10 ON NETFLIX MKS
Netflix : ఏది చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో టాప్ రేటెడ్ కంటెంట్ మీకోసం..
నెట్‌ఫ్లిక్స్ వెబ్సైట్
ఓవర్ ది టాప్ (ఓటీటీ)లతో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే, విస్తృతంగా అందుబాటులో ఉన్న కంటెంట్ లో ఏది బాగుంటుందో తేల్చులేకపోవడం. ఈ కన్ఫ్యూజన్ కు పరిష్కారంగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది..
ఓవర్ ది టాప్ (ఓటీటీ)లతో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే, విస్తృతంగా అందుబాటులో ఉన్న కంటెంట్ లో ఏది బాగుంటుందో తేల్చులేకపోవడం. ఏ సినిమా లేదా ఏ సిరీస్ చూడాలా? అనే సెర్చింగ్ కోసమే చాలా మంది టైమ్ వేస్టయిపోతుంటుంది. ఏది బెస్ట్ కంటెంట్? బెస్ట్ రేటింగ్ దేనికొస్తోంది? అనే సమాచారం ఇకపై అందరికీ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రేక్షకులు ఈజీగా ఛాయిస్‌లను ఎన్నుకునే వీలుంటుంది.. ఎలాగంటే.. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లకు కొత్త అనుభవాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థ తాజాగా కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
ప్రతి వారం అత్యధికంగా వీక్షించిన కార్యక్రమాలు, సినిమాలను ఇందులో పేర్కొంటామని తెలిపింది. ర్యాక్సింగ్ వారీగా వీటిని వెబ్సైట్లో పొందుపర్చనున్నట్లు వెల్లడించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో వీక్షించిన మొత్తం గంటల సంఖ్య ఆధారంగా టాప్-వ్యూడ్ టైటిల్స్‌ను ర్యాంక్‌ల వారీగా అందించనున్నట్లు తెలిపింది. కొత్త వీక్లీ టాప్- 10 హబ్ (https://top10.netflix.com/) ప్రతి మంగళవారం అప్డేట్ అవుతుంది. వివిధ విభాగాల్లో వీక్షించిన టాప్ సినిమాలు, సిరీస్‌ల జాబితాను అప్డేట్ చేస్తారు.
ప్రతి జాబితాలోని కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ సోమవారం నుంచి ఆదివారం వరకు ట్రాక్ చేస్తుంది. ఈ వివరాలను మంగళవారం నాడు వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది. ఈ జాబితాలో వివిధ సిరీస్‌ల సీజన్లను స్పెషల్ టైటిల్స్‌గా గణిస్తుంది. ఒక సీజన్లో పునరావృతమయ్యే వీక్షణలను సైతం మొత్తం వీక్షణ గంటలుగా లెక్కిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఒకే ఎపిసోడ్‌లోని సన్నివేశాన్ని పదే పదే చూస్తే.. అది ఆ సీజన్ మొత్తం వీక్షణ గంటలకు యాడ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ కొన్ని విభాగాల్లో టాప్ ఫిల్మ్స్, టీవీ సిరీస్‌లను ర్యాంక్ చేస్తుంది. ఇందులో ఇంగ్లీష్ సినిమాలు (Films- English), నాన్ ఇంగ్లీష్ సినిమాలు (Films non-English), ఇంగ్లీష్ టీవీ షోలు (TV- English), నాన్- ఇంగ్లీష్ టీవీ షోలు (TV non-English) ఉంటాయి.
ఈ జాబితాలలో కనిపించడానికి నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోని మొత్తం కంటెంట్‌కు అర్హత ఉంటుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కంటెంట్.. లైసెన్స్ పొందిన షోలు, సినిమాలు.. రెండూ ఉన్నాయి. పేర్కొన్న నాలుగు వర్గాల వారీగా అత్యంత ప్రజాదరణ పొందిన షోలు, సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది.
ఈ వెబ్సైట్లో టీవీ, ఫిల్మ్ కేటగిరీల విభాగంలో దేశాల వారీగా టాప్-10 టైటిల్స్ సైతం చూడవచ్చు. ఈ జాబితా కూడా ప్రతి మంగళవారం అప్డేట్ అవుతుంది. వినియోగదారులు గత వారాల్లో అత్యధికంగా వీక్షించిన కంటెంట్‌ను వీటి ద్వారా ట్రాక్ చేయవచ్చు.
ఒక షోకు సంబంధించిన ప్రతి సీజన్‌ను, ప్రతి ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతంగా పరిగణిస్తుంది. కాబట్టి మీరు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-2, సీజన్- 3 రెండూ టాప్ 10లో ఉండవచ్చు. ఇలాంటి టైటిల్స్ అన్నీ టాప్ 10లోకి వెళ్తాయి. ఏదైనా ఒక షో లేదా ఫిల్మ్ ఈ జాబితాలో ఎన్ని వారాలు ఉందనే వివరాలను సైతం ఈ వెబ్సైట్లో పొందుపర్చనుంది. స్ట్రీమింగ్ విషయంలో గణాంకాల వారీగా మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.