హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సుడిగాడివే బ్రో : కారు క్లీనర్ గా పనిచేసే యువకుడికి లాటరీలో రూ.21 కోట్లు

సుడిగాడివే బ్రో : కారు క్లీనర్ గా పనిచేసే యువకుడికి లాటరీలో రూ.21 కోట్లు

లాటరీ విజేత భరత్

లాటరీ విజేత భరత్

Car washer wins 21 crores lottery : ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ యువకుడికి అలాంటిదే జరిగింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Car washer wins 21 crores lottery : ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ యువకుడికి అలాంటిదే జరిగింది. కష్టపడి ఏ రోజు వచ్చిన డబ్బులతో ఆ రోజు పొట్ట నింపుకునే యువకుడికి అదృష్టం కొద్ది లాటరీ(Lottery)లో రూ. 21 కోట్లు రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఆ యువకుడి పేరు భరత్. నేపాల్(Nepal) కు చెందిన భరత్(Bharat) బతుకుదెరువు కోసం స్వదేశాన్ని వదిలి దుబాయ్(dubai) లో కారు క్లీనర్(Car Washer) గా పనిచేసేవాడు. భరత్ గత 3 సంవత్సరాలుగా కార్ వాషర్ గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి నేపాల్ లో రిక్షా నడుపుతుంటాడు. భరత్ ఇటీవల తన స్నేహితులతో కలిసి దుబాయ్ లో మెహజూజ్ డ్రా లాటరీని కొనుగోలు చేశాడు. లాటరీ ఫలితాలు ప్రకటించిన తర్వాత భరత్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. తాను కొనుగోలు చేసిన టిక్కెట్ కి మొదటి బహుమతిగా రూ.21 కోట్లు రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. రాత్రికి రాత్రే తన అదృష్టం మారిపోతుందని, కార్ క్లీనర్ నుంచి కోటీశ్వరుడు అవుతానని కలలో కూడా ఊహించలేదని అంటున్నాడు.

కాగా, ఇంత పెద్ద లాటరీని గెలుచుకున్న మొదటి నేపాలీ పౌరుడు భరత్ అనా తెలుస్తోంది. అయితే ఇప్పుడు భరత్ దుబాయ్ లో కారు క్లీనర్ ఉద్యోగం వదిలి తన దేశం నేపాల్‌కు తిరిగి వెళ్లడానికి సన్నాహాలు ప్రారంభించాడు. సెప్టెంబర్ 27న స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. కాగా, ఇంత పెద్ద లాటరీని గెలుచుకున్న మొదటి నేపాలీ పౌరుడు భరత్ అనా తెలుస్తోంది. అయితే బ్రెయిన్ ట్యూమర్ తో భాధపడుతున్న భరత్ తమ్ముడు ప్రస్తుతం మనదేశ రాజధాని ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. దీంతో భరత్ తన సోదరుడికి ట్రీట్మెంట్ కోసం ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేదని ఆనందపడుతున్నాడు. గెలుచుకున్న లాటరీ డబ్బుతో తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం ప్రారంభించాలనుకుంటున్నాడు భరత్.

రిసార్ట్ లోని రిసెప్షనిస్ట్ ని దారుణంగా హత్య చేసిన మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్!

కాగా,ఇటీవల మనదేశంలోని కేరళ రాష్ట్రంలో ఓనం బంపర్ 2022 లాటరీ(Onum Bumper Lottery)లోతిరువనంతపురంలోని శ్రీవరాహం నివాసి అయిన 32 ఏళ్ల ఆటో డ్రైవర్ అనూప్(Auto Driver Anoop)మొదటి విజేతగా నిలిచి రూ.25 కోట్లు గెల్చుకున్నాడు. లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన మరుసటి రోజే ప్రకటించిన ఫలితాల్లో అనూప్ ని అదృష్టం వరించింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dubai, Lottery, Nepal

ఉత్తమ కథలు