నేపాల్‌లోని ఆదివారం ప్రైవేటు ఎయిర్ లైన్స్ విమానం మిస్సయింది. పోఖారా నుంచి జోమ్సోమ్ వెళ్తున్న ఓ విమానం ఆదివారం ఉదయం అందుబాటులో లేకుండా పోయిందని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. టారా ఎయిర్ కు చెందిన ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు బయల్దేరిందని, కొద్ది సేపటికే రాడార్ పరిధికి దూరమైందని తెలిపారు. ఈ విమానాన్ని గుర్తించేందుకు మరో హెలికాప్టర్‌ను రంగంలోనికి దింపినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. విమానంలో నలుగురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఆ ప్రాంతంలో ఎత్తైన కొండలు ఉంటాయి.
Tara Air's 9 NAET twin-engine aircraft carrying 22passengers, flying from Pokhara to Jomsom at 9:55am, has lost contact, said the Airport authorities. 4 Indians on board.#TARAAIR#Nepal#Planecrashpic.twitter.com/2yPkBAh8Tl
ఆ ప్రాంతంతో తెమగా, మబ్బులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విమానాలు ఆ ప్రాంతాలకు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదైన ప్రమాదం జరిగిందా అని అధికారులు విచారణ చేపట్టారు. విమానంలో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ దేశస్థులు ఉన్నారు. మిగిలినవారు నేపాలీలు. సిబ్బందితో కలిపి విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిస్సింగ్ విమానాన్ని వెతికేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు నేపాల్ హోంశాఖ తెలిపింది. ముస్టాంగ్, పోఖరా నుంచి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. నేపాల్ ఆర్మీ చాపర్ ఎంఐ-17 ,విమానం సైతం ఆచూకి కోసం మోహరించినట్లు తెలుస్తోంది. ముస్టాంగ్లోని లేటే ప్రాంతంలో విమానం, ఎయిర్ లైన్స్ తో సంబంధాలు తెగిపొయినట్టు అధికారులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.