ఆ దేశంలో భూకంపం.. భారత్‌పై పడిన ప్రభావం

భూమి లోపల దాదాపు 40కి.మీ లోతు నుంచి ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. అసోం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్‌లోనూ భూమి కంపించింది.

news18-telugu
Updated: April 24, 2019, 11:53 AM IST
ఆ దేశంలో భూకంపం.. భారత్‌పై పడిన ప్రభావం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 24, 2019, 11:53 AM IST
ఎప్పుడూ భూకంపాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే హిమాలయ సరిహద్దు దేశం నేపాల్ మరోసారి భూకంపానికి గురైంది. ఆ దేశ రాజధాని ఖట్మండులో ఇవాళ ఉదయం 6.15 గంటలకు ప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.8గా నమోదైంది. ధాడింగ్ జిల్లాలో ఉదయం 6.29, 6.40 గంటల సమయంలో ప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.2, 4.3గా నమోదైనట్లు నేపాల్ నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. నేపాల్‌కు ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌లోనూ రిక్టర్‌స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇటానగర్‌కు 180 కి.మీ దూరంలో.. అసోంలోని దిబ్రుగర్‌కు 9కి.మీ దూరంలో భూకంపం సంభవించిన కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూమి లోపల దాదాపు 40కి.మీ లోతు నుంచి ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. అసోం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్‌లోనూ భూమి కంపించింది. అయితే, ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.

నేపాల్‌లో 2015, ఏప్రిల్ 25న సంభవించిన భూకంపం ధాటికి దాదాపు 9వేల మంది మృతి చెందారు. నాటి ఘటనలో చారిత్రక ధరహార స్థూపం కుప్పకూలింది. పురాతన ఆలయాలు, చారిత్రక సంపద మట్టిలో కలిసిపోయింది. అంతులేని ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించి ఎనిమిది దశాబ్దాల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాల పైన కూడా పడింది. బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోను ప్రకంపనలు వచ్చాయి.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...