ప్రముఖ సింగర్‌ను గట్టిగా పట్టుకొని... అందరిముందే ముద్దు పెట్టేశాడు

Indian Idol : ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జికి చేదు అనుభవం ఎదురయ్యింది. షోలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి... అక్కడున్న న్యాయనిర్ణేతకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా షోలో ఉన్న వారంతా షాకయ్యారు.

news18-telugu
Updated: October 20, 2019, 12:58 PM IST
ప్రముఖ సింగర్‌ను గట్టిగా పట్టుకొని... అందరిముందే ముద్దు పెట్టేశాడు
Indian Idol : ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జికి చేదు అనుభవం ఎదురయ్యింది. షోలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి... అక్కడున్న న్యాయనిర్ణేతకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా షోలో ఉన్న వారంతా షాకయ్యారు.
  • Share this:
ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జికి చేదు అనుభవం ఎదురయ్యింది. షోలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి... అక్కడున్న న్యాయనిర్ణేతకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా షోలో ఉన్న వారంతా షాకయ్యారు. ఇండియన్ ఐడల్ 11 షోకు ప్రముఖ సింగర్స్ అనుమాలిక్, విశాల్ దద్లాని, నేహా కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. స్టేజి మీద పాట పాడిన తర్వాత తనను గుర్తు పట్టవలసిందిగా సింగర్ నేహా కక్కర్‌ని కోరాడు కంటెస్టెంట్. దాంతో ఆమె స్టేజి మీదకు వెళ్లింది. తనతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్ ఆమెకు ఇచ్చాడు. కృతజ్ఞతగా ఆమె అతన్ని కౌగిలించుకుంది. ఆ సమయంలో ఆమెను బలవతంగా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కంటెస్టెంట్. యాంకర్, మిగతా జడ్జిలు, వ్యూవర్స్ అంతా షాకయ్యారు. వెంటనే జడ్జిలు అతన్ని అక్కడ నుంచి బయటకు పంపేశారు. ఈ  ఘటనతో కలత చెందిన ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

First published: October 20, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading