Chittoor: వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ జోరుగా పూజలు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం బొడిరెడ్డి కండ్రిగ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని నాగాలమ్మ ఆలయ ఆవరణ సమీపంలోని వేప చెట్టుకు ఈ రోజు ఉదయం నుంచి వింతగా పాలు కారుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

news18-telugu
Updated: October 19, 2020, 8:28 PM IST
Chittoor: వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ జోరుగా పూజలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి ఈ 2020 సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. కేవలం కరోనా మాత్రమే కాకుండా ప్ర‌కృతిలో కొన్ని వింత సంఘ‌ట‌లు సైతం ఈ ఏడాది లో చోటు చేసుకున్నాయి. ఏడాది ప్రారంభం నుంచి నిత్యం ఎదో ఒక ప్రాంతంలో ఎదో ఒక వింత చోటు చేసుకుంటోంది. తాజాగా చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం బొడిరెడ్డి కండ్రిగ గ్రామంలో ఇదే త‌ర‌హా వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని నాగాలమ్మ ఆలయ ఆవరణ సమీపంలోని వేప చెట్టుకు ఈ రోజు ఉదయం నుంచి వింతగా పాలు కారుతున్న దృశ్యాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వార్త కాస్త ఆ నోట ఈ నోట ప‌రిస‌ర‌ప్రాంతాల మొత్తం వ్యాప్తి చెంద‌డంతో ఈ వింత ఘ‌ట‌న చూసేందుకు ప్ర‌జ‌ల‌కు భారీగా తరలి వ‌స్తున్నారు. పాలు కారుతున్న దృశ్యాన్ని చూడటానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో వేప చెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. విరామం లేకుండా పాలు కార‌డం చూసి ఇదే దైవ మ‌హిమే అని అనేక మంది భక్తులు భావిస్తున్నారు.

ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తున్నా.. అవేమీ లేక్క చేయని గ్రామస్తులు వేప చెట్టుకు నైవేథ్యం సమర్పించి పూజలు చేస్తున్నారు. నాగాలమ్మ దేవతే ఈ వేప వృక్షంలో కొలువై ఉంటుందని అనుకుంటున్నారు. ఆ దేవతే వేప చెట్టును అవహించడం వల్ల చెట్టు నుంచి పాలు కారుతున్నాయని గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మ‌రికొంత మంది మాత్రం ఇది బ్రహ్మం గారు కలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతోందని.. ఆయ‌న త‌న కాల‌జ్ఞానంలో ఏనాడో చెప్పాడ‌ని అందుకే ఇప్పుడు వేప చెట్టు నుండి ఎడ‌తెరిపి లేకుండా పాలు కారుతున్నాయ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాలు రూపంలో ఉన్న ఒక ద్ర‌వం కారుతోందని నాస్తికులు చెపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అక్కడకు చేరుకుని వేప చెట్టును పరిశీలిస్తున్నారు. వేప చెట్టు నుంచి ఏందుకు పాలు కారుతున్నాయో అధ్యాయనం చేస్తున్నారు.


అస‌లు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయా? లేదా ఎదైన కెమిక‌ల్ కారుతోందా? అన్న కోణంలో అధికారులు ప‌రిశోధన చేస్తున్నారు. ఇప్ప‌టికే వేప చెట్టు నుంచి కారుతున్న పాలలాంటి రూపంలో ఉన్న ద్ర‌వాన్ని టెస్టుల నిమిత్తం అధికారులు ల్యాబ్ కు పంపించారు. పొలాల్లోకి ఆవులు మేప‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి ఈ వింతను మొదటగా గుర్తించాడు. వెంట‌నే త‌న బంధువుల‌కు, కొంత మంది స్థానికుల‌కు చెప్ప‌డంతో ఈ వార్త కాస్త ఆనోట ఈ నోట చేరుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్ర‌చారం అయింది. దీంతో భారీ సంఖ్య‌లో ప్రజలు ఈ సంఘ‌ట‌న చూడడానికివస్తున్నారు.

అయితే కారుతున్న‌వి పాలా? కాదా? అన్న అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే వ‌ర‌కు ఆ చెట్టు ను ముట్టుకోవ‌డానికి అధికారులు అనుతించ‌డం లేదు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎల్లయ్య న్యూస్18తో మాట్లాడుతూ.. వేప చెట్టు నుంచి పాలు కారడాన్ని గ్రామంలో కొంత మంది నాగ‌దేవ‌త మ‌హిమ అని బ‌లంగా న‌మ్ముతున్నారని చెప్పారు. ఇప్పుడు అధికారులు కూడా ఇక్క‌డ‌కు చేరుకున్నారన్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 19, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading