కండోమ్ అంటే ఛీ.. ఛీ.. అంటున్న ఇండియన్స్.. తెలుగు రాష్ట్రాల్లోనైతే..

Condom Use: కండోమ్ లాభాలు తెలిసినా 94.4 శాతం మంది భారతీయులు దాన్ని వాడేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా దేశ జనాభా ఒక రేంజ్‌లో పెరుగుతోంది. 97.9 శాతం మంది భారతీయులకు కండోమ్ గురించి, దాని ముఖ్యపాత్ర గురించి తెలుసట.

news18-telugu
Updated: July 15, 2019, 8:08 PM IST
కండోమ్ అంటే ఛీ.. ఛీ.. అంటున్న ఇండియన్స్.. తెలుగు రాష్ట్రాల్లోనైతే..
తమ భాగస్వామి ‘జీ స్పాట్’ ఎక్కడో తమకు తెలుసని 51 మంది తెలిపారు.
  • Share this:
కండోమ్.. జనాభా, సుఖ వ్యాధుల నియంత్రణకు పదునైన ఆయుధం. దీని వాడకాన్ని ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి వైద్యుల వరకు ప్రతీ ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా దృష్ట్యా కండోమ్ వాడకం చాలా అవసరం అయితే, భారతీయ జంటలు కండోమ్ అంటేనే.. ఛీ.. ఛీ.. అనేస్తున్నాయి. దాని వల్ల ప్రయోజనాలు తెలీక అలా అంటున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే..! కండోమ్ లాభాలు తెలిసినా 94.4 శాతం మంది భారతీయులు దాన్ని వాడేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా దేశ జనాభా ఒక రేంజ్‌లో పెరుగుతోంది. 97.9 శాతం మంది భారతీయులకు కండోమ్ గురించి, దాని ముఖ్యపాత్ర గురించి తెలుసట. అంత తెలిసినా కండోమ్ పేరెత్తగానే దూరం.. దూరం.. అంటున్నారట. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2018లో వెల్లడైన విషయాలు ఇవీ. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం..2027 నాటికి చైనా జనాభాను భారత్ మించిపోతుందట.

దేశంలోని రాష్ట్రాలను పరిశీలిస్తే.. కండోమ్ వాడేందుకు ఏ మాత్రం ఇష్టపడని రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో 0.2 శాతం, తెలంగాణలో 0.5 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. ఆ తర్వాత తమిళనాడు 0.8 శాతం, బిహార్ 1 శాతం, కర్ణాటక 1.3 శాతం ఉన్నాయి.

కండోమ్ ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో ఛండీగఢ్ 27.3 శాతంతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 19 శాతం, పంజాబ్ 18.9 శాతం, ఉత్తరాఖండ్ 16.1 శాతం, హిమాచల్‌ప్రదేశ్ 12.7 శాతం ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. హంకాంగ్‌లో 50.1 శాతం మంది, జపాన్‌లో 46.1 శాతం మంది కండోమ్ వాడుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాలో 11.6 శాతం, యూకేలో 7 శాతం మంది మాత్రమే కండోమ్‌ను వాడుతున్నారు. ఇక, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు కూడా భారతీయ పురుషులు అస్సలు ఇష్టపడటం లేదు. అత్యంత దారుణంగా 0.3 శాతం మంది మాత్రమే స్టెరిలైజేషన్‌‌కు ముందుకొస్తున్నారు.
First published: July 15, 2019, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading