టీమిండియా సక్సస్ సీక్రెట్ అదేనట...షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ను కోహ్లీసేన చిత్తుగా ఓడించడంపై స్పందించిన పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది...భారత్ టీమ్ క్రికెట్‌లో రాటుదేలేందుకు ప్రధాన కారణం ఏంటో విశ్లేషించాడు.

news18-telugu
Updated: June 18, 2019, 7:04 PM IST
టీమిండియా సక్సస్ సీక్రెట్ అదేనట...షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు
పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(ఫైల్ ఫోటో)
  • Share this:
వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మొన్నటికి మొన్న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి జట్టు పాక్‌ను 89 పరుగుల తేడాతో కోహ్లీ సేన మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్...ఇలా మూడు అంశాల్లోనూ పాకిస్థాన్‌పై స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంది భారత్. భారత జట్టు సక్సస్‌కు కారణమేంటో పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది విశ్లేషించారు. ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు బలమైన జట్టుగా ఆవిర్భవించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రధాన కారణంగా పేర్కొన్నాడు.

యువ ఆటగాళ్లలో నైపుణ్యాన్ని గుర్తించడంతో పాటు వారు ఒత్తిడిని జయించే నైపుణ్యాన్ని ఐపీఎల్ నేర్పుతోందని అఫ్రిది అన్నాడు. ఐపీఎల్ కారణంగా భారత్ క్రికెట్‌లో నాణ్యత, ఆటగాళ్ల నైపుణ్యత బాగా పెరిగిందని వివరించారు. పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన సందర్భంగా బీసీసీఐకి అభినందనలు తెలిపాడు.First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...