డ్రగ్ టెస్ట్ కోసం ప్లాస్టిక్ అంగాన్ని వాడాను : లామర్ ఒడోమ్ సంచలన ప్రకటన

NBA star Lamar Odom : ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకోవడానికి కొంతమంది అడ్డదారులు తొక్కుతుంటారు. తానూ అదే చేశానన్నాడు NBA స్టార్ లామర్ ఒడోమ్.

Krishna Kumar N | news18-telugu
Updated: May 19, 2019, 9:31 AM IST
డ్రగ్ టెస్ట్ కోసం ప్లాస్టిక్ అంగాన్ని వాడాను : లామర్ ఒడోమ్ సంచలన ప్రకటన
లామర్ ఓడోమ్
  • Share this:
అవి 2004 ఒలింపిక్ గేమ్స్. వాటిలో ఎలాగైనా స్థానం సంపాదించి, తన టాలెంట్ చూపించాలనుకున్నాడు అమెరికా నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (NBA) స్టార్ అటగాడు లామర్ ఒడోమ్. ఐతే... అందులో చేరాలంటే కొన్ని రకాల టెస్టులు చేస్తారు. వాటిలో అంగ పరీక్ష (Penis Test) కూడా ఉంటుంది. డ్రగ్స్ (మత్తు పదార్థాలు) తీసుకునే అలవాటు ఉన్న లామర్... ఎట్టి పరిస్థితుల్లో ఆ టెస్టు నుంచీ తప్పించుకోవాలనుకున్నాడు. ఏం చేసైనా ఒలింపిక్స్‌ బాస్కెట్ బాల్ టీంలో స్థానం సంపాదించుకోవాలి అనుకున్నాడట. వెంటనే ప్లాస్టిక్ అంగం (Prosthetic Penis) ఒకటి తెప్పించుకున్నాడట. డ్రగ్ టెస్టు చెయ్యడానికి డ్రగ్ టెస్టర్... తన ఇంటికి వచ్చినప్పుడు... ఆ నకిలీ అంగాన్ని ఉపయోగించి... అసలు విషయం తెలియకుండా తప్పించుకున్నాననీ, తద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కిందని... 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు తను రాసిన పుస్తకం ద్వారా బయటపెట్టాడు లామర్ ఒడోమ్.

2004లో NBA ఛాంపియన్ అయ్యాడు లామర్ ఒడోమ్. తను ఎలా చీట్ చేసిందీ డార్క్‌నెస్ టు లైట్ బుక్ లో వివరించాడు. బాస్కెట్‌ బాల్ టీంలో సెలెక్ట్ అవ్వడం తన కెరీర్‌లో అత్యుత్తమ సందర్భం అన్నాడు లామర్. మత్తు పదార్థమైన వీడ్ (గంజాయి లాంటిది)ని ప్రతి రోజూ స్మోక్ చేస్తానన్న లామర్... నకిలీ అంగాన్ని కొనడం తప్ప తనకు వేరే మార్గం దొరకలేదన్నాడు. నిజానికి ఈ ఐడియా తనది కాదనీ... తన ట్రైనర్‌ది అని తెలిపాడు. రకరకాల ఆప్షన్లు వెతికాక... చివరకు ప్లాస్టిక్ అంగాన్ని కొనాలని ఇద్దరూ కలిసి డిసైడైనట్లు వివరించాడు. ఆన్‌లైన్‌లో రకరకాల ప్లాస్టిగ్ అంగాల్ని పరిశీలించి... చివరకు ఓ పెద్ద, బ్లాక్ కలర్ అంగం కోసం ఆర్డరివ్వగా... మర్నాడు అది పార్శిల్‌లో ఇంటికొచ్చిందని తెలిపాడు లామర్.

టెస్ట్ ఎలా జరిగిందంటే : టెస్ట్ చెయ్యడానికి వచ్చిన డ్రగ్ టెస్టర్... రెండు అడుగుల దూరంలో నిలబడి... ఓ ప్లాస్టిక్ కప్పు ఇచ్చి... అందులో యూరిన్ పోసి ఇమ్మన్నాడట. లామర్ అంతకంటే ముందే ఆ ప్లాస్టిక్ అంగంలో తన ట్రైనర్ యూరిన్‌ను పోసి ఉంచాడు. టెస్టర్ వచ్చినప్పుడు... అతనికి అనుమానం రాకుండా... ప్యాంట్స్ జిప్పు తీసి... ప్లాస్టిక్ అంగాన్ని బయటకు తీసి... కప్పులో యూరిన్ పోశాడట. ఆ కప్పును డ్రగ్ టెస్టర్‌కి ఇవ్వగా అతను అందులో ఓ థెర్మోమీటర్ పెట్టాడట. ఆ యూరిన్ కాస్త వేడిగానే ఉన్నట్లు తేలడంతో... అది లామర్ యూరినే అని భావించాడట టెస్టర్. పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందనీ ఎక్కడా ఎలాంటి అనుమానమూ రాకుండా నటించాననీ లామర్ వివరించాడు. లామర్ ట్రైనర్‌కి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకపోవడం వల్ల ఆ టెస్టులో లామర్ పాస్ అయ్యాడు.

ప్రస్తుతం తాను డ్రగ్స్ తీసుకోకపోయినా... ఇప్పటికీ తీసుకుంటున్నట్లుగా తనను మాటిమాటికీ టెస్టులు చేస్తున్నారని మండిపడుతున్నాడు లామర్. జీవితంలో ఇంకెప్పుడూ డ్రగ్స్ ముట్టనని చెబుతున్నాడు.

 

ఇవి కూడా చదవండి :

లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?నారా లోకేష్ హ్యాపీ... లగడపాటి సర్వేతో గెలుపుపై పెరిగిన ధీమా

లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?

ఏపీ... చంద్రగిరి : ఏడు కేంద్రాల్లో రీపోలింగ్... భారీ భద్రతా ఏర్పాట్లు...

నేడు ఏడో దశ పోలింగ్... బరిలో ఉన్న ప్రముఖులు వీరే...
First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading