ప్రిన్సెస్ డయానా జిమ్ డ్రెస్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..

Princess Diana: ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా ధరించిన ఓ డ్రెస్ ఊహించనంత ధరకు అమ్ముడుపోయింది. జిమ్ చేసే సమయంలో ఆమె ధరించిన స్వెట్‌షర్టును తన జిమ్ ట్రైనర్ జెన్నీ రివెట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 17, 2019, 8:05 PM IST
ప్రిన్సెస్ డయానా జిమ్ డ్రెస్ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా..
ప్రిన్సెస్ డయానా (Photo:Reuters/Kieran Doherty)
  • Share this:
ప్రముఖులు వాడే వస్తువులైనా, వేసుకునే డ్రెస్‌లైనా వేలం వేస్తే.. అభిమానులు లక్షలు, కోట్లైనా పెట్టి వాటిని దక్కించుకుంటారు. క్రికెటర్లు వాడే బ్యాటు దగ్గరి నుంచి నటీనటులు, ఇతర ప్రముఖులు వేసుకునే దుస్తుల వరకు వేలంలో అమ్ముడైన సందర్భాలు ఎన్నో. తాజాగా, బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు, దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా ధరించిన ఓ డ్రెస్ ఊహించనంత ధరకు అమ్ముడుపోయింది. జిమ్ చేసే సమయంలో ఆమె ధరించిన స్వెట్‌షర్టును తన జిమ్ ట్రైనర్ జెన్నీ రివెట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ షర్టును జెన్నీ ఈ మధ్యే వేలం వేసింది. ఆ వేలంలో 53,532 డాలర్లు వచ్చాయి. అంటే.. రూపాయల్లో.. 37లక్షలు అన్నమాట.

princess diana, sweatshirt, diana, princess, princess of wales, వేల్స్ యువరాణి డయానా, జిమ్ డ్రెస్, డయానా జిమ్ డ్రెస్ వేలం, prince harry gym,gym,(hz) world prince george gifts,fitness,prince harry,go to prince,prince harry wedding,stealthy sweatshirt antics,prince,princess diana’s,princess polly,pleased to meet ya,shedding for the wedding,how to make oreo jam,workout,fashion,personal trainer,prince harrys stag,clothing haul,prince william,american eagle,richard branson
ప్రిన్సెస్ డయానా ధరించిన జిమ్ డ్రెస్ (Pic: REUTERS/Kieran Doherty)


కాగా, ప్రిన్సెస్ డయానా 1989 జూలై 29న.. రాణి ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు. వారే.. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ. చార్లెస్, డయానా మధ్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే, 1997 ఆగస్టు 31న ఓ కారు ప్రమాదంలో ఆమె మరణించారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>