Home /News /trending /

Punjab: పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​ను ‘బడా భాయ్​’ అంటూ సిద్ధూ వ్యాఖ్యలు.. సోషల్ ​మీడియాలో వీడియో వైరల్​

Punjab: పాకిస్తాన్​ ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​ను ‘బడా భాయ్​’ అంటూ సిద్ధూ వ్యాఖ్యలు.. సోషల్ ​మీడియాలో వీడియో వైరల్​

సిద్ధూ (ఫైల్​)

సిద్ధూ (ఫైల్​)

పంజాబ్​లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా నవ్యజోత్ సింగ్​ మాట్లాడిని ఓ వీడియో (Video)ని వదిలింది. దీంతో పంజాబ్​లో రచ్చ మొదలైంది.

    పంజాబ్​ రాజకీయాలు (Punjab politics) ఆసక్తిగా మారాయి. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉండటంతో అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష బీజేపీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా పంజాబ్​ కాంగ్రెస్​లో అమరీందర్​ సింగ్ (Amarinder singh)​ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చరణ్​ సింగ్ (Charn jeeth singh)​ బాధ్యతులు, నవజ్యోత్​సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) వ్యవహారం తారాస్థాయిలో రచ్చరచ్చగా మారింది. అయితే కాంగ్రెస్​ అధిష్టానం (congress high command) అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది. దీంతో ముఖ్యమంత్రిగా చరణ్​ సింగ్​, ఎన్నికల ప్రచార బాధ్యతలు సిద్దూ నడిపేట్లు వ్యవహారం సాగుతోంది. అయితే అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్​ నడం బిగించింది. దీనిలో భాగంగా వ్యవసాయ చట్టాలకు  (Agriculture laws) వ్యతిరేకంగా ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొని అరెస్టయిని 80 మందికి పైగా రైతులకు సీఎం చరణ్​ జిత్​ రెండు లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బీజేపీ (BJP) ఖండించింది కూడా. అయితే దీనితో పంజాబ్​లో కాంగ్రెస్​కు మైలేజీ పెరిగిందనేది వాస్తవం. అయితే ఇదే సమయంలో పంజాబ్​లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా నవ్యజోత్ సింగ్ (Navjot Singh Sidhu)​ మాట్లాడిని ఓ వీడియో (Video)ని వదిలింది. దీంతో పంజాబ్​లో రచ్చ మొదలైంది.

    ప్రధానమంత్రి తరఫున స్వాగతం పలుకుతున్నట్లు..

    ఈ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Pakistan PM Imran Khan)ను సిద్ధూ ‘బడా భాయ్’ (పెద్దన్న)గా సంభోదించారు. గత శనివారం పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌లో సిద్ధూ (Navjot Singh Sidhu) పర్యటించిన సమయంలో.. స్థానిక అధికారులు సిద్ధూకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి తరఫున స్వాగతం పలుకుతున్నట్లు సదరు అధికారి పేర్కొనగా.. ఆయన తన పెద్దగా సిద్ధూ స్పందించారు. ఈ వీడియోను (video) బీజేపీ సోషల్ మీడియా విభాగ చీఫ్ అమిత్ మాల్వియా (amith Malviya) తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ (share) చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.



    అమరీందర్ సింగ్‌ను పక్కనబెట్టి..

    రాహుల్ గాంధీ (Rahul gandhi) ఇష్టపడే సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పెద్దన్న అంటున్నారని.. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ భాజ్వాను ఆలింగనం చేసుకుని ప్రశంసల్లో ముంచెత్తారని గుర్తుచేశారు. నెహ్రూ (Nehru) కుటుంబీకులు మాజీ ఆర్మీ సైనికాధికారి అమరీందర్ సింగ్‌ను పక్కనబెట్టి పాక్‌ను ప్రేమించే సిద్ధూను నెత్తికెత్తుకోవడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? అంటూ అమిత్ మాల్వియా వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ (Navjot Singh Sidhu )పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వయంగా హాజరుకావడం తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Imran khan, Navjot Singh Sidhu, Pakistan, Politics, Punjab, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు