అక్కడ నగ్నంగా పనిచేస్తే.. గంటకు రూ.4వేల వరకు సంపాదన..

లండన్‌కు చెందిన నేచరిస్ట్ క్లీనర్ సంస్థ.. నగ్నంగా ఉండి, ఇళ్లను శుభ్రం చేసేందుకు ఇష్టపడే మహిళా సిబ్బంది కావాలని, వారి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ప్రకటించింది.

news18-telugu
Updated: September 20, 2019, 5:37 PM IST
అక్కడ నగ్నంగా పనిచేస్తే.. గంటకు రూ.4వేల వరకు సంపాదన..
నేచరిస్ట్ క్లీనింగ్ (Photo: www.naturistcleaners.co.uk)
  • Share this:
ఇదో వింత ప్రకటన.. లండన్‌కు చెందిన నేచరిస్ట్ క్లీనర్ సంస్థ చేసిన ప్రకటన.. నగ్నంగా ఉండి, ఇళ్లను శుభ్రం చేసేందుకు ఇష్టపడే మహిళా సిబ్బంది కావాలని, వారి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని ప్రకటించింది. కస్టమర్లకు నగ్నంగా పనిచేసే మనుషులను సరఫరా చేస్తున్న ఈ కంపెనీ.. మహిళల వయసుతో, ఒంపుసొంపులతో నిమిత్తం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, పని చేసేటపుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదని, కేవలం స్లిప్పర్స్, గ్లోవ్స్ మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. అలా పనిచేస్తే గంటకు రూ.4వేలు(45 పౌండ్లు) ఇస్తామని పేర్కొంది. 2017లోనే ఈ కంపెనీ తన సర్వీసులను ప్రారంభించగా, ఇప్పుడు మరోసారి రిక్రూట్‌మెంట్‌ చేసుకోనుంది. పాత్రలు కడగడం, ఇస్త్రీ చేయడం, ఇల్లు తుడవడం, వంటావార్పూ వంటి పనులను ఒంటిపై నూలుపోగు లేకుండా చేయాలని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ కంపెనీకి భారీగానే లాభం దక్కుతోందట. ఎక్కువగా ఒంటరి పురుషులే ఎక్కువగా వీరికి అద్దెకు తీసుకుంటున్నారని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉండగా, సర్వీస్ చేసే మహిళలు నగ్నంగా ఉన్నారు కదా అని అడ్వాంటేజీ తీసుకుంటే మాత్రం.. కస్టమర్లపై చర్యలు తీసుకుని, పరువు నష్టం దావా వేస్తుంది ఈ కంపెనీ.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>