• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • NASAS MARS OVER CREATES HISTORY ON RED PLANET HERE THE FULL DETAILS GH SRD

Mars Rover : మార్స్ పై నాసా మరో అద్భుత సృష్టి.. ఈ సారి నిజంగా అద్భుతమే..

నాసా పెర్సెవరెన్స్ రోవర్

Mars : ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను అంగారక గ్రహంపైకి పంపిన నాసా.. ఈ మధ్య కాలంలోనే పర్సెవరెన్స్​ అనే రోవర్​ను రంగంలోకి దించింది. ఈ గ్రహంపై వాతావరణం, ఖనిజ నిల్వలు, నీటి జాడలను కనిపెట్టడమే ముఖ్య లక్ష్యంగా మార్ష్‌పైకి ఈ రోవర్​ను ప్రయోగించింది.

  • Share this:
అంగారక గ్రహంపై మానవ జీవనానికి అనువైన పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన స్పేస్​ ఏజెన్సీలు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టాయి. అయితే, ఈ ప్రయోగాల్లో అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) ముందుంది. ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను అంగారక గ్రహంపైకి పంపిన నాసా.. ఈ మధ్య కాలంలోనే పర్సెవరెన్స్​ అనే రోవర్​ను రంగంలోకి దించింది. ఈ గ్రహంపై వాతావరణం, ఖనిజ నిల్వలు, నీటి జాడలను కనిపెట్టడమే ముఖ్య లక్ష్యంగా మార్ష్‌పైకి ఈ రోవర్​ను ప్రయోగించింది. అయితే, తాజాగా అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసి చరిత్ర సృష్టించింది. అక్కడి వాతావరణం నుంచి కొంత కార్బన్​ డయాక్సైడ్​ తీసుకొని దాన్ని స్వచ్ఛమైన, ఊపిరి పీల్చుకునే ఆక్సిజన్​గా మార్చింది. మార్స్ ఆక్సిజన్ ఇన్–సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ (MOXIE) అని పిలువబడే టోస్టర్-సైజ్ పరికరంతో ఈ ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు నాసా పేర్కొంది. దీంతో భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని విజిట్​ చేసే వ్యోమగాములు శ్వాస తీసుకోగలుగుతారని తెలిపింది. నాసా మొట్టమొదటి యాక్టివేషన్​లో 5 గ్రాముల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసింది. ఇది వ్యోమగామికి అందించే దాదాపు 10 నిమిషాల విలువైన శ్వాసకు సమానం అని తెలిపింది. భూమిపై నుండి ప్రయోగించిన 7 నెలల తర్వాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపై అడుగుపెట్టిన ఆరు చక్రాల రోవర్​ పర్సీవరెన్స్ ఈ అద్భుతాన్ని సృష్టించింది. దీంతో వ్యోమగాములు ఇక్కడి నుంచి ఆక్సిజన్​ను తీసుకెళ్లే బాధ తప్పింది. వారు ఆక్సిజన్​ను తీసుకెళ్లడానికి బదులుగా మార్టిన్​ వాతావరణం నుంచి కార్బన్​ డయాక్సైడ్​ను ఆక్సిజన్​గా మార్చే యంత్రాన్ని తీసుకెళ్లడం చాలా సులులవని నాసా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

భూమి నుంచి ఆక్సిజన్​ తీసుకెళ్లే తిప్పలు తప్పాయి..
కాగా, అంగారక గ్రహంపై ఆక్సిజన్​ను తయారు చేయడంపై ఎస్‌టిఎమ్‌డి అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ జిమ్ రౌటర్ మాట్లాడుతూ ‘‘మార్స్​పై కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడంలో ఇది కీలకమైన మొదటి అడుగుగా భావిస్తున్నాం. ఆక్సిజన్​ ఉత్పత్తిలో MOXIE పరికరం బాగా పనిచేస్తోంది. మానవుడు జీవించడానికి కీలకమైన ఆక్సిజన్​ జాడ లభించడం మా లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది.”అని అన్నారు. అదేవిధంగా, రాకెట్లు లేదా వ్యోమగాముల కోసం, ఆక్సిజన్ కీలకమని మోక్సీ ప్రధాన పరిశోధకుడు, మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హేస్టాక్ అబ్జర్వేటరీకి చెందిన మైఖేల్ హెచ్ట్ పేర్కొన్నారు.

నాసా ప్రకారం, మార్టిన్​ ఉపరితలానికి నలుగురు వ్యోమగాములు రావడానికి సుమారు 15,000 పౌండ్ల (7 మెట్రిక్ టన్నులు) రాకెట్​ ఇంధనం, 55,000 పౌండ్ల (25 మెట్రిక్ టన్నులు) ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అయితే, ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్​ పైకి తీసుకెళ్లకుండా వెసులుబాటు కలిగింది. 25 టన్నుల ఆక్సిజన్​ను తీసుకెళ్లడానికి బుదులుగా టన్ను ఆక్సిజన్​ మార్పిడి యంత్రాన్ని మార్స్​కు రవాణా చేయడం సులభం అని హెచ్ట్ చెప్పారు. కాగా, గంటకు 10 గ్రాముల వరకు ఆక్సిజన్​ను ఉత్పత్తి చేసేలా మోక్సి యంత్రాన్ని రూపొందించారు నాసా శాస్త్రవేత్తలు. ఈ యంత్రాన్ని రాబోయే రెండేళ్లలో వివిధ పరిస్థితులు, వేగంతో కనీసం మరో తొమ్మిది సార్లు నడపాలని యోచిస్తున్నట్లు నాసా పేర్కొంది.
Published by:Sridhar Reddy
First published: