Home /News /trending /

NASA WARNS AS GAINT ASTEROID MAY HIT EARTH ON 18 AUGUST PVN

Asteroid may hit earth: ఆగస్టు 18న భూమిపై విధ్వంసం?..ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Asteroid may hit earth: చాలా సార్లు ప్రపంచంలో విధ్వంసానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోజు వినాశనం జరుగుతుంది అంటూ అంచనా వేయబడింది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ప్రపంచం అంతం కావాలంటే అది అంతరిక్షం నుండి వచ్చిన ఉల్క వల్ల మాత్రమే అని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Asteroid may hit earth : చాలా సార్లు ప్రపంచంలో విధ్వంసానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ రోజు వినాశనం జరుగుతుంది అంటూ అంచనా వేయబడింది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ప్రపంచం అంతం కావాలంటే అది అంతరిక్షం నుండి వచ్చిన ఉల్క వల్ల మాత్రమే అని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటున్నారు. దీని వెనుక కారణం చరిత్ర. వాస్తవానికి ప్రపంచం నుండి డైనోసార్ల కనుమరుగుకి కారణం అంతరిక్షం నుండి పడిపోయిన ఉల్క అని నమ్ముతారు. మానవజాతి అంతం కూడా ఈ కారణంగానే జరుగుతుందని అందరూ భయపడుతున్నారు. చాలా సార్లు శాస్త్రవేత్తలు భూమికి సమీపంలో ఒక ఉల్క పోయిందని చెప్పి ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి అలాంటి అంచనాలే వెలువడ్డాయి. అయితే ఈసారి విషయం సీరియస్‌గా ఉంది. ఈ ఉల్కపై నాసా నిరంతరం నిఘా ఉంచింది. ఇది భూమి(Earth)కి చాలా దగ్గరగా వెళుతుంది. ఈ కారణంగా దీనిని "ప్రమాదకర గ్రహశకలం(Potentially Hazardous Asteroid)" గా ప్రకటించారు.

ఆగస్టు 18 న
ఈ గ్రహశకలం నేరుగా భూమిని ఢీకొట్టదని నాసా(NASA)తెలిపింది. బదులుగా, అది భూమి అంచు గుండా వెళుతుంది. ప్రమాదం తక్కువ. కానీ భూమి యొక్క గురుత్వాకర్షణ దానిని తన వైపుకు లాగగలదు. దీంతో ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ఈ ఉల్క చాలా పెద్దది. గత నెలలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఇప్పుడు కేవలం పది రోజుల తరువాత, అంటే ఆగస్టు 18 న, ఇది భూమి యొక్క కక్ష్య సమీపంలోకి వెళుతుంది. నాసా లెక్కల ప్రకారం ఇది ఆగస్టు 18న భూమికి 6.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే వెళుతుంది.



Kim Jong UN : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలొకి కిమ్ ఎంట్రీ..ఇక వార్ వన్ సైడే!

అది ఢీకొంటే విధ్వంసం తప్పదు
నాసా ప్రకారం, ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని నాసా తెలిపింది. దీని పరిమాణం చాలా పెద్దది. దీని ఎత్తు 235 మీటర్ల పొడవు ఉంటుంది. నాసా దీనిని "సంభావ్య ప్రమాదకర గ్రహశకలం"గా అభివర్ణించింది. ఇది కాకుండా, మరో ఉల్క ఆగస్టు నెలలో భూమికి సమీపంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఆగస్టు 22న భూమికి సమీపంలోకి వెళుతుంది. అయితే భూమి దగ్గరకు వచ్చేసరికి దాని పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Asteroid, Earth, NASA

తదుపరి వార్తలు