Home /News /trending /

NASA SHARES STUNNING PHOTO OF WHAT THE SNOW CAPPED HIMALAYAS LOOK FROM SPACE MS GH

Stunning Photos: హిమాలయాలపై NASA తీసిన కళ్లు చెదిరే ఫొటోలు

నాసా (Image source Nasa/Instagram)

నాసా (Image source Nasa/Instagram)

Stunning Photos Of Himalayas: హిమగిరి సొగసులు.. మురిపించెను మనసులు అనేలా హిమాలయా (Himalayas)లపై నాసా (Nasa) తీసిన ఫొటోలు మంత్రముగ్దులను చేస్తున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలను చూడండి..

  • News18
  • Last Updated :
హిమాలయాల అందం ఏమని వర్ణించగలం. NASA తాజా చిత్రాలు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. హిమాలయాలపై National Aeronautics and Space Administration (NASA) తీసిన కొత్త ఫొటోలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. మంచుతో కప్పబడి ఉన్న తెల్లని హిమాలయాల సొగసులతో పాటు రాత్రి పూట మన రాజధాని ఢిల్లీ అందాలను కూడా కనువిందు చేసేలా ఈ ఫొటోలుండటం విశేషం. International Space Station (ISS)లోని ఓ బృందం తీసిన ఈ కళ్లు చెదిరే పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో మంచి అట్రాక్షన్స్ గా ప్రశంసలు అందుకుంటున్నాయి. నాసా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటోలను షేర్ చేసిన వెంటనే.. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఫొటోలను NASA తన లో పోస్ట్ చేస్తూ వీటిని వర్ణించింది కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వాత శిఖరమైన హిమాలయాలు 50 మిలియన్ల ఏళ్లుగా భూమి పొరల్లో జరుగుతున్న మార్పులు చేర్పుల ద్వారా రూపొందాయని తన రైటప్ లో నాసా వివరించింది. అత్యంత సారవంతమైన ఉత్తర భారత దేశం, పాకిస్థాన్ లోని కొంత భూభాగం, టిబెట్ పీఠభూమి ఎంత చక్కగా కనిపిస్తోందో అంటూ వర్ణించింది.










View this post on Instagram






A post shared by NASA (@nasa)






ప్రపంచ పైకప్పు ఉత్తరాది నుంచి కనిపిస్తుందంటూ అంటూ హిమ శిఖరాల గొప్పతనాన్ని చాటింది. కాంతివంతమైన రాత్రి లైట్ల వెలుగుల జిలుగుల మధ్య న్యూఢిల్లీ, ఇండియా, లాహోర్, పాకిస్థాన్ అందాలు కనువిందు చేస్తున్నాయంటూ రాసుకొచ్చిన నాసా ఫొటోలు










View this post on Instagram






A post shared by NASA (@nasa)






నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

ఈ ఫొటోలు చూసి, రైటప్స్ చదివిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక వీటిని పోస్ట్ చేసినప్పటి నుంచీ 1,114,270 లైకులు రాగా, టన్నులకొద్దీ రియాక్షన్స్ వస్తుండడం హైలైట్. ఓ నెటిజన్ ఏకంగా ...అంటూ కామెంట్ చేయగా మరో నెటిజన్ ఏంటీ.. "పైనుంచి చూస్తే ఈ సిటీలు ఇంతలా కాంతులీనుతున్నాయా" అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ అయితే.. "మీరు ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులను కూడా చూడచ్చని" కామెంట్ చేశాడు. కొందరు నెటిజన్లు హార్ట్ ఈమోజీతో తమ స్పందన తెలియజేస్తున్నారు. ఇక ''incredible '' అంటూ రియాక్ట్ అవుతున్న నెటిజన్ల సంఖ్యకు లెక్కలేదు.

నాసా టెలిస్కోప్ కు 30 ఏళ్లు

నాసా ఉపయోగిస్తున్న Hubble space telescopeకు 30 ఏళ్లు నిండాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా నమ్మశక్యం కాని ఇటువంటి ఫొటోలను నాసా షేర్ చేసింది. ఈ momentous dayకు గుర్తుగా 30 చిత్రరాజాలతో నెటిజన్లకు కనువిందు చేసింది. తరచూ నాసా ఇలాంటి ఫొటోలను విడుదల చేస్తుండగా, హై రెజల్యూషన్ టెలిస్కోప్ తో తీసిన ఫొటోలు వావ్ అనిపించేలా ఉంటాయి.
Published by:Srinivas Munigala
First published:

Tags: NASA, Photos, Social Media, Trending, VIRAL NEWS

తదుపరి వార్తలు