• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NASA MARS ROVER TO HUNT FOR ALIEN FOSSILS LAST SEVEN MINUTES PLAYS CRUCIAL ROLE FULL DETAILS HERE HSN GH

NASA Mars rover: ఏలియన్స్ జాడ కనుక్కునేందుకు రూ.17,450 కోట్లతో నాసా రోవర్ ప్రయోగం.. ఆ ఏడు నిమిషాలు గండమే..

NASA Mars rover: ఏలియన్స్ జాడ కనుక్కునేందుకు రూ.17,450 కోట్లతో నాసా రోవర్ ప్రయోగం.. ఆ ఏడు నిమిషాలు గండమే..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఈ రోవర్ ఆ గ్రహంపై జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో దిగనుంది. ఇది ఒక పురాతనమైన సరస్సు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం నీటితో నిండి ఉండేది. నదులు, సరస్సులు నిండుగా ఉండేవి.

  • Share this:
అంగారకుడిపై గ్రహాంతర జీవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ కృషి చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ఈ రోవర్ ఆ గ్రహంపై జెజెరో క్రేటర్ అనే ప్రదేశంలో దిగనుంది. ఇది ఒక పురాతనమైన సరస్సు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం నీటితో నిండి ఉండేది. నదులు, సరస్సులు నిండుగా ఉండేవి. ఆ నీటిలో అనేక రకాల సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. అందుకే వాటి ఆనవాళ్ల కోసం జెజెరో క్రేటర్ సరస్సు పరివాహక ప్రాంతంలో మార్స్ రోవర్ ని ల్యాండ్ చేసేందుకు సన్నాహాలు చేసింది నాసా. ఆ సూక్ష్మ జీవుల శిలాజాలను గుర్తించడమే లక్ష్యంగా ఓ రోబో అంగారకుడిపై అన్వేషణ సాగించనుంది. ఈ ప్రయోగానికి నాసా 2.4 బిలియన్ డాలర్లు (దాదాపు 17వేల 450 కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది. ఒక SUV సైజులో ఉండే Perseverance అనే రోబోను అంగారకుడి మీదకు పంపింది. ఈ రోబో రోవర్ ఈరోజు జెజెరో క్రేటర్‌లో దిగనుంది. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటలకు ఈ ల్యాండింగ్ ప్రక్రియ పూర్తవనుంది.

జెజెరో క్రేటర్ 28 మైళ్ల వెడల్పులో విస్తరించి ఉంది. ఇక్కడ 3.5 బిలియన్ స౦వత్సరాల క్రిత౦ నదులు ప్రవహించేవి. ఒకవేళ అంగారక గ్రహంపై సూక్ష్మ జీవులు నివసిస్తే.. నదుల నుంచి నీటి ప్రవాహం ద్వారా లేదా మట్టి ద్వారా అవి సరస్సులోకి చేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు లేవు. అందువల్ల సరస్సు అడుగున స్ట్రోమటోలైట్లు అనే శిలాజాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిని పరిశీలిస్తే అక్కడ జీవుల ఉనికి గురించి తెలియనుంది. మన సోలార్ సిస్టమ్‌లో జెజెరో క్రేటర్ వంటి ప్రాంతంలోనే ఏలియన్స్ నివసించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భూమిపైన నివసించిన అతి పురాతన జీవులు కూడా స్ట్రోమటోలైట్‌లే. 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భూమిపైన ఉన్న సరస్సుల్లో ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల క్రేటర్ సరస్సులోనూ అవి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే వీటి ఆనవాళ్ల కోసం నాసా రోవర్ ప్రయత్నించనుంది.
ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ఏడు నిమిషాలు గండమే..
ఏడు నెలల క్రితం ప్రయోగించిన ఈ మార్స్ రోవర్ ఇప్పటి వరకూ తనదైన కక్ష్యలో ప్రయాణించి లక్ష్యానికి చేరువగా చేరుకుంది. అయితే చివరి ఏడు నిమిషాలు మాత్రం ఎంతో కీలకమైనవని చెప్పుకోవాలి. అంగారక గ్రహ వాతావరణంలోకి అడుగుపెట్టిన తర్వాత అంతరిక్ష నౌక నుంచి మార్స్ రోవర్ విడిపోతుంది. ఇది గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది విడిపోయిన తర్వాత అంగారకుడిపై ల్యాండ్ అయ్యే వరకూ ప్రతి నిమిషమూ కీలకమే.. ఇది ల్యాండ్ అయ్యేందుకు ఏడు నిమిషాల సమయం పడుతుంది.
ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

మార్స్ వాతావరణంలోకి ప్రవేశించడానికి పది నిమిషాల ముందు స్పేస్ క్రాఫ్ట్ క్రూజ్ స్టేజ్ ని వదిలి డిసెంట్ స్టేజ్ లోకి మారుతుంది. దీనివల్ల దానికి ఇంధనం అందించే ట్యాంకులు, రేడియోలు, సోలార్ ప్యానెళ్లు అన్నీ తొలగిపోయి చుట్టూ ఓ ఎయిరో షెల్ మాత్రమే మిగులుతుంది. ఇది హీట్ షీల్డ్ గా వ్యవహరిస్తుంది. ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన శక్తిని కూడా ఇదే అందిస్తుంది. అప్పటికే అంగారక గ్రహ వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల చుట్టూ ఉష్ణోగ్రత కొన్ని వందల డిగ్రీల సెల్సియస్ గా ఉన్నా ఎయిరో షెల్ లోపల మాత్రం గది ఉష్ణోగ్రత ఉంటుంది. గంటకు 1600 కిలోమీటర్ల వేగానికి తగ్గిన తర్వాత ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఓ సూపర్ సోనిక్ ప్యారాచూట్ తెరచుకుంటుంది. సరైన దిశలో, సరైన ప్రదేశంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఇందులో రేంజ్ ట్రిగ్గర్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ పర్సెవరెన్స్ రోవర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడుతుంది.
ఇది కూడా చదవండి: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే..

భూమికి రానున్న శాంపిల్స్
పర్సెవరెన్స్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త కెన్ ఫార్లే నాసా మిషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భూమికి బయట జీవ౦ ఉ౦డేదని కనుగొనడ౦ ఒక అద్భుతమైన వైజ్ఞానిక ఆవిష్కరణగా మారనుందని ఆయన తెలిపారు. క్రేటర్ ప్రాంతంలో పర్సెవరెన్స్ రోబో 40 శాంపిల్స్‌ను సేకరించి, వాటిని ప్రత్యేక ట్యూబ్‌లలో నిల్వ చేయనుంది. భవిష్యత్తు పరీక్షల కోసం వాటిని భూమికి తీసుకురానున్నారు. అంగారకుడిపై ఉండే కొండలు, ఇసుక మేటలు, బండల్లో కూడా నాసా రోవర్ ల్యాండ్ అయ్యి పని పూర్తిచేయగలదు.

సుదీర్ఘంగా ప్రయాణించనున్న రోవర్
క్రేటర్ సరస్సు మధ్య అడుగు భాగం నుంచి అంచుల వరకు రోవర్ ప్రయాణించనుంది. అంగారకుడిపై పర్సెవరెన్స్ ప్రయాణానికి దాదాపు 15 మైళ్ల మార్గాన్ని నాసా ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ ప్రయాణంలోనే అక్కడక్కడా మట్టి, రాళ్ల శాంపిల్స్‌ను రోబో సేకరించనుంది. ఒక ఫ్యాన్ ఆకారంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో రోవర్ ల్యాండ్ అవ్వనుంది. అప్పట్లో ఓ నది నుంచి ఈ సరస్సులోకి నీరు, మట్టి ప్రవహించిందని భావిస్తున్నారు. శిలాజాల కోసం రోవర్ ముందు సరస్సు మధ్యలో అడుగుభాగాన ఉన్న బురద నేలలో అన్వేషించనుంది. ఆ తరువాత నావిగేషన్ ప్రకారం డెల్టా ప్రాంతానికి ప్రయాణం కొనసాగిస్తుంది. స్టొమటోలైట్ల కోసం రోవర్ స్కానింగ్ చేస్తూ, జెజెరో సరస్సులోని కార్బొనేట్ బీచ్‌ల వెంట ప్రయాణించనుంది.
ఇది కూడా చదవండి: స్కేటింగ్ చేస్తుండగా విరిగిపోయిన మంచు.. సరస్సులో పడిపోయి నానా తిప్పలు.. వైరల్ వీడియో

శాస్త్రవేత్తల ఆశాభావం
పెద్ద సైజులో ఉండే ఉల్కల వంటి ఖగోళ వస్తువులు అంగారకుడిని ఢీకొట్టినప్పుడు జెజెరో క్రేటర్ సరస్సు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పుడు ఏర్పడ్డ పేలుడు వల్ల వివిధ రకాల మినరల్స్‌ అక్కడ నిక్షిప్తమై ఉండే అవకాశం ఉంది. వీటిని గ్రహాంతరవాసులు ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల సరస్సు అంచుల్లోని పొరల్లో ఉన్న శిలాజ రాళ్లను కూడా పర్సెవరెన్స్ రోవర్ అధ్యయనం చేయనుంది. అంగారకుడిపై క్రేటర్ సరస్సు ప్రాంతం నివాసానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. భూమిపై నివాసానికి అనుకూలంగా ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ప్రాణుల ఆనవాళ్లు బయటపడ్డాయి. అందువల్ల నాసా మిషన్‌లో కూడా సూక్ష్మజీవులు, ఏలియన్స్ ఆనవాళ్లు బయటపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Published by:Hasaan Kandula
First published:

అగ్ర కథనాలు