మెరుపును దగ్గరి నుంచి చూస్తే ఇలా ఉంటుంది.. ఆకాశంలో అద్భుతం

ఈ మ్యాజికల్ వీడియోపై నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వావ్.. చాలా అద్భుతం అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 'అంతరిక్షం ఇంత అందంగా, ఇంత ప్రశాతంగా ఉంటుందా.. నేను కూడా ఒకసారి వెళ్తే బాగుటుంది' అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 23, 2020, 3:03 PM IST
మెరుపును దగ్గరి నుంచి చూస్తే ఇలా ఉంటుంది.. ఆకాశంలో అద్భుతం
ఐఎస్ఎస్ నుంచి మెరుపు దృశ్యాలు
  • Share this:
ఆకాశమే ఓ మహాద్భుతం..! అంతరిక్షం అంతుచిక్కని రహస్యం..! సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు.. ఇలా విశ్వంలో ప్రతీ ఒక్కటి ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. అప్పుడప్పుడూ కనిపించే సూర్య గ్రహణం, చంద్రగహణం, తోక చుక్కలు, సూపర్ మూన్‌లు వినువీధిలో సందడి చేస్తూ.. మనకు కనువిందు చేస్తాయి. సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇక వర్షం కురిసే సమయంలో ఆకాశంలో కనిపించే మెరుపులు.. సరికొత్త ప్రపంచాన్ని కళ్లకు చూపిస్తాయి. భూమి మీద నుంచి మెరుపును చూస్తే.. నల్లటి మబ్బుల్లో భారీ వెలుగు చార ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు కనిపిస్తుంది.

అదే మెరుపును భూమి మీద నుంచి కాకుండా.. ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఆ అద్భుత దృశ్యాలను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)కు చెందిన వ్యోమగామి బాబ్ బెన్కెన్ కెమెరాల్లో బంధించాడు. బెన్కెన్ ఇటీవల స్పేస్ ఎఖ్స్ క్రూ డ్రాగన్‌ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లాడు. అక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి మెరుపును కెమెరాల్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఊదారంగులో మెరిసిన గ్రహ వలయాలు చాలా అద్భుతంగా కనిపించాయి. ఆకాశంలో లేజర్ షో పెట్టారా? అన్నట్లుగా కనువిందు చేశాయి. 9 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు.

ఈ మ్యాజికల్ వీడియోపై నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వావ్.. చాలా అద్భుతం అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 'అంతరిక్షం ఇంత అందంగా, ఇంత ప్రశాతంగా ఉంటుందా.. నేను కూడా ఒకసారి వెళ్తే బాగుటుంది' అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 23, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading