HOME »NEWS »TRENDING »nasa astronaut shares his first video of earth from space but it doesnt do it justice sk gh

Viral video: అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఇలా ఉంటుంది? అదిరిపోయిందిగా..

Viral video: అంతరిక్షం నుంచి చూస్తే భూమి ఇలా ఉంటుంది? అదిరిపోయిందిగా..
అంతరిక్షం నుంచి భూమి

Viral Video of earth: అంత ఎత్తు నుంచి భూమిని తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో భూమిపైన తెల్లటి మేఘాలు మచ్చలుగా కనిపిస్తున్నాయి. పూర్తిగా నీలిరంగులో అద్భుతంగా కనిపిస్తున్న వీడియోను గ్లోవర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

  • Share this:
భూమి నుంచి ఆకాశం చాలా అందంగా.. ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నీలాకాశంలో తెల్లటి మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనువిందు చేస్తాయి. మరి అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిసిస్తుంది? ఈ ప్రశ్నకు అద్భుతం.. ఆమోఘమని.. సమాధానం చెబుతున్నారు ఓ వ్యోమగామి. అంతరిక్షం నుంచి చూస్తే భూమి చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. విక్టర్ గ్లోవర్ అనే ఆస్ట్రోనాట్ మొదటిసారి అంతరిక్షానికి వెళ్లారు. స్పేస్‌కు వెళ్లేటప్పుడు వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ రెసీలియన్స్ (Dragon Resilience) ఫ్లైట్ కిటికీ నుంచి భూమిని చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెబుతున్నారు. అంత ఎత్తు నుంచి భూమిని తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో భూమిపైన తెల్లటి మేఘాలు మచ్చలుగా కనిపిస్తున్నాయి. పూర్తిగా నీలిరంగులో అద్భుతంగా కనిపిస్తున్న వీడియోను గ్లోవర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.




నవంబర్ 15న స్పేస్‌ఎక్స్ అంతరిక్షంలోకి పంపిన ఆస్ట్రోనాట్స్ బృందంలో ఆయన ఒకరు. వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ రెసీలియన్స్ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లేటప్పుడు ఈ వీడియో తీశారు. మొదటిసారి భూమిని అంత ఎత్తు నుంచి చూసిన గ్లోవర్ ఉత్సాహాన్ని, ఎగ్జైట్‌మెంట్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయారు.

స్పేస్‌కు వెళ్లిన మొదటి ప్రైవేటు స్పేస్‌క్రాఫ్ట్
డ్రాగన్ రెసిలియన్స్ వ్యోమనౌకలో మొత్తం నలుగురు అంతరిక్షానికి వెళ్లారు. ఇది అమెరికన్ స్పేస్ మిషన్లలో మొట్టమొదటి ప్రైవేట్ కార్పొరేషన్ స్పేస్ ఫ్లైట్. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్‌ ఎక్స్‌, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కలిసి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. గ్లోవర్‌తో పాటు కమాండర్ మైఖేల్ హాప్కిన్స్, నాసా వ్యోమగామి షానన్ వాకర్, జపనీస్ అంతరిక్ష సంస్థ జాక్సా నుంచి సోయిచి నోగుచి ఈ బృందంలో ఉన్నారు. గ్లోవర్ మిడిల్ స్కూల్ లో ఉన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేవాడని డైలీ మెయిల్ వార్తాసంస్థ చెబుతోంది. ఈ మిషన్‌తో అతడు తన కలను నెరవేర్చుకోవడంతో పాటు ఒక చరిత్రను కూడా సృష్టించాడు. ISSకు ప్రైవేట్ మిషన్‌ ద్వారా వెళ్లిన మొదటి వ్యక్తులలో గ్లోవర్ ఒకరు. ISSలో ఎక్కువ రోజులు గడపనున్న మొదటి నల్లజాతి వ్యక్తి కూడా అతడే కావడం విశేషం. ఈ బృంద సభ్యులు ఆరు నెలలపాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉంటూ పరిశోధనలు చేయనున్నారు.

గ్లోవర్ పేరుతో రికార్డులు
ఇప్పటి వరకు 300 మంది అమెరికన్లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. వీరిలో కేవలం 14 మంది మాత్రమే నల్లజాతీయులు ఉన్నారు. వారు ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపడానికి వెళ్లలేదు. గ్లోవర్ 2013లో నాసాలో ఉద్యోగంలో చేరాడు. అతడు అమెరికన్ నేవీలో కమాండర్‌గా పనిచేశాడు. ఇప్పటి వరకు స్పేస్‌కు వెళ్లిన 15మంది ఆఫ్రికన్-అమెరికన్ వ్యక్తులలో అతడు కూడా ఒకరు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గ్లోవర్... తాను ఇప్పటి వరకు విమానాల్లో 6,400 అడుగుల ఎత్తు వరకు వెళ్లినట్టు చెప్పారు. అంతరిక్షంలో ఉండటానికి అంతకు మించి దూరం వెళ్తున్నానని ఉత్సాహంగా తెలిపారు. ఇప్పుడు అతడు భూమి నుంచి 11,61,600 అడుగుల ఎత్తులో ఉన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:November 28, 2020, 16:10 IST

टॉप स्टोरीज